📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest News: AP Mega DSC 2025 – మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ తుది జాబితా విడుదల

Author Icon By Anusha
Updated: September 10, 2025 • 11:48 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఏపీలో కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా డీఎస్సీ (Mega DSC) ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఇప్పుడు తుది అంకానికి చేరుకుంటోంది. ఎంతోకాలంగా నిరీక్షిస్తున్న అభ్యర్థులలో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. గత కొన్నినెలలుగా ఈ ప్రక్రియ దశలవారీగా కొనసాగుతూ వచ్చినా, తుది జాబితా ఎప్పుడొస్తుందన్న ప్రశ్న అభ్యర్థులను కంగారు పెట్టింది.

ఇప్పటికే విద్యాశాఖ నాలుగు విడతలుగా సర్టిఫికెట్ల పరిశీలన (వెరిఫికేషన్) పూర్తి చేసింది. అయితే ఇంకా కొంతమంది అభ్యర్థుల వివరాలపై స్పష్టత రాకపోవడంతో ఈ దశ కొంత ఆలస్యమైంది. అయినా చివరికి అన్ని అడ్డంకులు తొలగి, ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను ఈ నెల 12న విడుదల చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది.

నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తూ ఉన్న వేలాది మంది యువతకు

అభ్యర్థుల కోసం ఇది ఒక సంతోషకరమైన పరిణామం. ఎందుకంటే, గత కొన్నేళ్లుగా డీఎస్సీ నోటిఫికేషన్ (DSC Notification) కోసం ఎదురుచూస్తూ ఉన్న వేలాది మంది యువతకు ఈ నియామకాలు కొత్త ఆశలు నింపాయి. ఇప్పటికే పరీక్షలు పూర్తి చేసుకున్నా, నియామకాలపై అనిశ్చితి నెలకొనడం వల్ల అభ్యర్థుల్లో ఆందోళన పెరిగింది. ఇప్పుడు తుది ఫలితాల ప్రకటనతో ఆ గందరగోళానికి ముగింపు పలకనుంది. 

మరోవైపు ఉద్యోగాలు సాధించిన అభ్యర్థుల తుది జాబితాను సెప్టెంబరు 12న విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. మెగా డీఎస్సీలో ఉద్యోగాలు పొందిన వారికి సీఎం చంద్రబాబు చేతుల మీదుగా నియామక పత్రాలను అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవాడలో నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది.

Latest News

ఒక్క అభ్యర్థిని మాత్రమే ధ్రువపత్రాల పరిశీలన

సీఎం చంద్రబాబు టైం టేబుల్‌ను బట్టి, సెప్టెంబరు 15 తర్వాత ఎప్పుడైనా నియామక పత్రాలు అందజేసే కార్యక్రమాన్ని నిర్వహించే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. డీఎస్సీ మెరిట్‌ జాబితా ఇప్పటికే విడులైంది. మూడో విడతలోనూ ధ్రువపత్రాల పరిశీలనలో సుమారు 30 మంది అభ్యర్థులు తిరస్కరణకు గురయ్యారు. వీరి స్థానంలో కొత్తవారిని ధ్రువపత్రాల పరిశీలనకు పిలిచారు. సర్టిఫికెట్ల పరిశీలన కూడా కొలిక్కివస్తే.. క్లారిటీవచ్చే అవకాశం ఉంది.తుది ఎంపిక జాబితాను రూపొందించి సెప్టెంబర్‌ 12వ తేదీన వెబ్‌సైట్‌లో ఉంచేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

అంతా అనుకున్నట్లు జరిగితే మొత్తం 16,347 టీచర్‌ పోస్టుల భర్తీకి సంబంధించిన నియామక ప్రక్రియ తుది దశకు చేరుకున్నట్లు అవుతుంది. కాగా రాత పరీక్ష అనంతరం రిజర్వేషన్‌ రోస్టర్‌ ప్రకారం ఒక్క పోస్టుకు ఒక్క అభ్యర్థిని మాత్రమే ధ్రువపత్రాల పరిశీలనకు పిలిచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ చేపట్టారు. కొన్ని జిల్లాల్లో పోస్టులకు అభ్యర్థులు లేకపోవడంతో 700 వరకు పోస్టులు మిగిలే అవకాశం ఉంది. మిగిలిపోయిన పోస్టులను వచ్చే డీఎస్సీలో భర్తీ చేయాలని అధికారులు భావిస్తున్నారు.

Read hindi news:hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/telanagana-crime-3-die-of-suffocation-in-sampu/crime/544365/

Andhra Pradesh Breaking News certificate verification final list release latest news Mega DSC recruitment school education department September 12 teacher jobs Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.