📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest News: AP MEGA DSC 2025 – మెగా డిఎస్సీ తుది జాబితా విడుదల

Author Icon By Anusha
Updated: September 16, 2025 • 11:20 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భర్తీగాని 406 ఖాళీలు –

సెకండ్ లిస్ట్ ఉండదన్న అధికారులు

విజయవాడ : ఏపీ మెగా డీఎస్సీ (AP Mega DSC) తుది ఎంపిక జాబితాను రాష్ట్ర విద్యాశాఖ విడుదల చేసింది. ఎంపికైన వారి వివరాలను మెగా డిఎస్సీ వెబ్సైట్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎంపిక జాబితాను జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయాల్లోనూ అందు బాటులో ఉంచనున్నారు.

కూటమి ప్రభుత్వం అథికారం లోకి వచ్చాక 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డిఎస్సీ ప్రకటనను ఏప్రిల్ 20న విడుదల చేసింది. 3,36,300 మంది అభ్యర్థులు 5,77,675 ధరఖాస్తులను సమర్పించారు. జూన్ 6 నుంచి జులై 2 వరకు రెండు విడతలుగా ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించారు. జులై 5న ప్రాథమిక కీ, ఆగస్టు 1న తుది కీ విడుదల చేశారు.

రాష్ట్ర పాఠశాల విద్యశాఖ కార్యదర్శి

టెట్ కు 20% వెయిటేజీ ఇచ్చారు. ఏడు విడతలుగా అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలనను అధికారులు పూర్తి చేశారు. ఎంతో పారదర్శకంగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియను కేవలం 150రోజుల్లో పూర్తిచేసి, సెలెక్టెడ్ అభ్యర్థుల తుది జాబితాను నేను జారీ చేయడం జరి చెందని రాష్ట్ర పాఠశాల విద్యశాఖ కార్యదర్శి కోన శశిధర్ (Education Secretary Kona Shashidhar) పేర్కొన్నారు.

సోమవారం రాష్ట్ర మెగా డిఎస్సీ తుది జాబితా సచివాలయం ప్రచార విభాగంలో పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ విజయరామ రాజుతో కలసి పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లా డుతూ నేడు చాలా శుభదినం అని, ఉపాధ్యాయులుగా ఎంపికైన అయిన వారందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ అందరికీ అందుబాటులో ఉందని చెప్పారు.

మొదటి ప్రాధాన్యత పరీక్షా కేంద్రాన్ని కేటాయించడం

అభ్యర్థుల నుండి అద్భుతమైన స్పందన వచ్చిందని, ఏప్రిల్ 20, మే 15, 2025 మధ్య కాలంలో 3,36,300 అభ్యర్థుల నుండి 5,77,675 దరఖాస్తులు వచ్చాయని వివరించారు. ముఖ్యంగా 87 అభ్యర్థులు వారి మొదటి ప్రాధాన్యత పరీక్షా కేంద్రాన్ని కేటాయించడం జరిగిందన్నారు. కంప్యూటర్ ఆధారిత పరీక్షలు జూన్ 6 నుండి జులై 2, 2025 వరకు రెండు షిఫ్టుల్లో పటిష్టమైన భద్రతా చర్యలతో నిర్వహించామని తెలిపారు.

AP MEGA DSC 2025

ప్రాథమిక సమాధానాల కీ జులై 5న విడుదల చేసి, జులై 12 వరకు అభ్యంతరాలు స్వీకరించి, నిపుణుల సమీక్ష తర్వాత ఆగస్టు 1న ఫైనల్ కీ (Final Key) ప్రచురించామని వివరించారు. పెద్ద సంఖ్యలో అభ్యర్థులు, కొన్ని కేటగిరీలకు షిఫ్టుల కారణంగా (69 కేటగిరీలలో 9 కేటగిరీలకు), జాతీయంగా గుర్తించబడిన నార్మలైజేషన్ పద్ధతిని ఈ 9 కేటగిరీ పోస్టులకు అవలంబించామని చెప్పారు.

వెయిటేజ్ తో తయారు చేశామని

అన్నిసెషన్లలో న్యాయబద్ధతను నిర్ధారించడానికి మెరిట్ జాబితా (Merit List) లను టెట్ స్కోర్ల నుండి20 వెయిటేజ్. డీఎస్సీ స్కోర్ల నుండి 80 వెయిటేజ్ తో తయారు చేశామని వివరించారు. మెగా డీఎస్సీ 2025 ఆనేక చారిత్రాత్మక మైలురాళ్లను సృష్టించిందని, ఇది సబ్ క్లాసిఫికేషన్ ను అమలు చేసిన మొదటి నియామకం,

కొత్త 3 కోటా కింద 372 పోస్టులను స్పోర్ట్స్ పర్సన్స్ తో భర్తీ చేసిన మొదటిది, మహిళలు, శిజూద్బీ, మాజీ సైనికులు,మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్ తో సహా అన్ని కేటగిరీలలో వర్టికల్ మరియు హారిజాంటల్ రిజర్వేషన్లను అమలు చేసిన మొదటిదని వివరించారు. మైక్రో వెరిఫికేషన్ ప్రక్రియ తర్వాత 15,941 అభ్యర్థులతో ఫైనల్ సెలెక్షన్ లిస్టులను తయారు చేశామని చెప్పారు.

ఈ లిస్ట్కు వెయిటింగ్ లిస్ట్ కానీ

మిగిలిన 406 ఖాళీలు సంబంధితకమ్యూనిటీలో అర్హతపొందిన అభ్యర్థుల అందుబాటులేక పోవడంతో భర్తీ కాలేదని, ఈ ఖాళీలను తదుపరి డీఎస్సీ నోటిఫికేషన్లో భర్తీ చేస్తామని వివరించారు. సెలెక్ట్ అయిన 15,941 మందిలో 7,955 మహిళలు,7,986పురుషులు ఉన్నారని, అంటే 49.9 మహిళలు, 50.1 పురుషులు అని వివరించారు.

మహిళలకు దాదాపు 50 సాధించడం హర్షనీయ విషయమని చెప్పారు. అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ లిస్ట్కు వెయిటింగ్ లిస్ట్ కానీ సెకండ్ లిస్ట్ కానీ ఉండదని స్పష్టం చేశారు. అభ్యర్థుల సౌకర్యార్థం హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామని, ఈ క్రిందిఫోన్నంబర్లు (8125046997, 9398810958, 7995649286, 7995789286) ద్వారా సహాయం అందుబాటులో ఉందని వివరించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/speaker-ayyanna-patrudu-the-countrys-progress-is-only-possible-through-women-empowerment/business/548058/

AP Mega DSC Breaking News final selection list latest news mega dsc website selected candidates details state education department Telugu News Vijayawada

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.