हिन्दी | Epaper
స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest News: AP Mega DSC 2025 Counselling – మెగా డీఎస్సీ పోస్టింగ్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ ఇదే!

Anusha
Latest News: AP Mega DSC 2025 Counselling – మెగా డీఎస్సీ పోస్టింగ్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ ఇదే!

రాష్ట్రవ్యాప్తంగా భారీగా ఎదురుచూసిన ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియ విజయవంతంగా ముగిసింది. విద్యాశాఖ ఇటీవల నిర్వహించిన డీఎస్సీ  (AP Mega DSC) నియామకాల తుది ఫలితాలను ఇప్పటికే తమ అధికారిక వెబ్‌సైట్‌ (Website) లో అందుబాటులో ఉంచింది. ఈ మెగా డీఎస్సీ ద్వారా పాఠశాలలలో ఉపాధ్యాయ సిబ్బంది కొరతను భర్తీ చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేసింది. మొత్తం 16,347 ఖాళీ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేయగా, ఈ నియామకాల పట్ల అభ్యర్థులలో అపారమైన ఆసక్తి కనిపించింది.

అధికారుల సమాచారం ప్రకారం, ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 3,36,300 మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేశారు. ఒకరికన్నా ఎక్కువ పోస్టులకు దరఖాస్తులు సమర్పించిన వారితో కలిపి మొత్తం దరఖాస్తుల సంఖ్య 5,77,675 వరకు చేరింది. ఇది ఇప్పటి వరకు డీఎస్సీ చరిత్రలోనే అతిపెద్ద రిక్రూట్‌మెంట్‌ (Recruitment) గా నిలిచింది.ఇందులో ఆయా రిజర్వేషన్‌ అభ్యర్థులు లేనందున 406 పోస్టులు మిగిలిపోయాయి. మెగా డీఎస్సీని ప్రభుత్వం కేవలం 150 రోజుల్లోనే పూర్తిచేసింది. ప్రాథమిక ‘కీ’పై 40 వేల అభ్యంతరాలురాగా.. అన్నింటినీ పరిశీలించి తుది ‘కీ’ రూపొందించారు.

కేటాయించిన బడుల్లో

రాత పరీక్షకు 80 శాతం, టెట్‌కు 20 శాతం వెయిటేజీతో ఫలితాలను వెలువరించింది. మొత్తం 69 కేటగిరీల్లో డీఎస్సీ నిర్వహించగా.. వీటిల్లో 9 కేటగిరీల్లో నార్మలైజేషన్‌ను పాటించారు. ఇక ధ్రువపత్రాల పరిశీలన 7 విడతల్లో ఆగస్టు 28 నుంచి సెప్టెంబరు 13 వరకు చేపట్టారు. అలాగే క్రీడా కోటా 3% రిజర్వేషన్‌ (Reservation) అమలు చేస్తూ పోస్టులను భర్తీ చేసిన తొలి ప్రక్రియ ఇదే కావడం విశేషం. క్రీడా కోటాలో ఎలాంటి రాత పరీక్ష లేకుండా 372 మందికి ఉద్యోగాలు వచ్చాయి.ఇటీవల విడుదల చేసిన మెగా డీఎస్సీ తుది జాబితాలోని అభ్యర్థుల పోస్టింగ్‌.

లకు సంబంధించి సెప్టెంబర్‌ 22 నుంచి కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. దసరా సెలవుల్లో 22 నుంచి 29 వరకు కొత్తగా ఎంపికైన అధ్యాపకులకు శిక్షణ ఇచ్చి, కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. దసరా సెలవుల అనంతరం వీరంతా తమకు కేటాయించిన బడుల్లో చేరనున్నారు. అభ్యర్థుల సౌకర్యార్థం హెల్ప్‌డెస్క్‌ కూడా ఏర్పాటు చేశారు. ఏవైనా సందేహాలుంటే 8125046997, 9398810958, 7995649286, 7995789286 ఫోన్‌ నంబర్లను సంప్రదించాలని అధికారులు సూచించారు. ఎంపికైన వారందరికీ సెప్టెంబర్‌ 19న అమరావతిలో సీఎం చంద్రబాబు చేతుల మీదగా నియామక పత్రాలను అందజేయనున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/viveka-murder-case-supreme-court-gives-key-instructions-to-sunitha/andhra-pradesh/548410/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870