AP Meeting : జిల్లా, మండల, గ్రామాల పేర్లు, సరిహద్దులు మార్పులు (Changes in village names and boundaries) చేసేందుకు తగిన సూచనలు చేసేందుకై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల బృందం మొదటి సారి ఈనెల 13వ తేదీన అంటే బుధవారం ఉదయం 11 గంటలకు జరుగుతుంది. ఈ సమావేశం వెలగపూడి సచివాలయంలోని రెండో బ్లాక్ మొదటి అంతస్తులో గల కాన్ఫరెన్స్ హాల్లో సమావేశమోతోందని రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. గత వైఎస్సార్సీ ప్రభుత్వం జిల్లాల పునః వ్యవస్థీకరణ చేసినప్పుడు ఒక నియమం అంటూ పాటించకుండా అడ్డదిడ్డంగా చేసేశారు. దీంతో కొన్ని జిల్లాల్లో ప్రజలు జిల్లా కేంద్రంకు వెళ్లి పని చేయించుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాలకు పేర్లు పెట్టడంలోనూ వివాదాలు తలెత్తాయి. మొత్తంగా జిల్లా, మండల, గ్రామాల పేర్లను మార్చాలంటూ, వాటి సరిహద్దులు మార్చాలంటూ ప్రజలు, ప్రజా ప్రతినిధులు ప్రభుత్వానికి పదే పదే విన్నవించుకున్నారు. ఈ నేపథ్యంలో కూటమిప్రభుత్వం ఈ అంశాలపై అధ్యయనం చేసి పరిష్కార మార్గాలను చూపేందుకు రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ తోపాటు మరో ఆరు గురితో మంత్రుల బృందాన్ని (GOM) ఏర్పాటు చేసింది.
READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :