📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest news: AP: మెడికల్ కాలేజీల ఫీజులు ఖరారు

Author Icon By Saritha
Updated: November 11, 2025 • 11:28 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయవాడ : రాష్ట్రంలోని ప్రైవేటు అన్ఎయిడెడ్ ప్రొఫెషనల్ (AP)వైద్య, దంత వైద్య కళాశాలల్లో సూపర్ స్పెషాలిటీ, పీజీ,(Postgraduate) యూజీ కోర్సులకు 202526 విద్యా సంవత్సరానికి ఫీజుల్ని ప్రభుత్వం ఖరారు చేసింది. 202023 బ్లాక్ పీరియడ్లో ఉన్న ఫీజుపై యూజీ కోర్సులకు 10శాతం, సూపర్ స్పెషాలిటీ, పీజీ కోర్సులకు 15శాతం చొప్పున పెంపును తాత్కాలికంగా ఆమోదించింది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ మూడు వేర్వేరు ఉత్తర్వులిచ్చింది. సుప్రీంకోర్టు, హైకోర్టులో పెండింగ్లో ఉన్న కేసుల తుది తీర్పునకు లోబడి ఈ ఫీజు నిర్ణయం ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొంది.

Read also: ఢిల్లీలో పేలుడు కలకలం.. బాధితుల లిస్ట్

AP: మెడికల్ కాలేజీల ఫీజులు ఖరారు

కోర్సుల కేటగిరీ వారీగా కొత్త ఫీజు వివరాలు

సూపర్ స్పెషాలిటీ కోర్సులకు వచ్చేసరికి జీఎస్ఎల్ మెడికల్ కాలేజీ, కాటూరి మెడికల్ కాలేజీ, నారాయణ మెడికల్ కాలేజీ, ఎన్ఆర్ ఐ మెడికల్ కాలేజీ, డాక్టర్ సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వైద్య కళాశాలలకు రూ.17.25 లక్షలుగా(AP) ఫీజును నిర్ధారించింది. ఎంబీబీఎస్ లో కేటగిరీల ప్రకారం ఫీజు వివరాలు గమనిస్తే ఏకేటగిరీ ఫీజు రూ.16,500, బీకేటగిరీ ఫీజు రూ. 13.20 లక్షలు (మేనేజ్మెంట్ కోటా), సీ కేటగిరీ ఫీజుగా రూ.39.60 లక్షలు (ఎన్ఆరి కోటా) నిర్ణయించారు. బీడీఎస్ (డెంటల్)కు వచ్చే సరికి ఏకేటగిరీ ఫీజు రూ. 14,300, బీకేటగిరీ ఫీజు: రూ.4.40 లక్షలు (మేనేజ్మెంట్ కోటా), సీ కేటగిరీ ఫీజు రూ.13.20 లక్షలు (ఎన్ఆరి కోటా)గా ఉంది. పీజీ కోర్సులకు మెడికల్ విభాగంలో ఫీజుల వివరాలను గమనిస్తే క్లినికల్ డిగ్రీ కోర్సులకు ఏ కేటగిరీ ఫీజు రూ.4,96,800 (కన్వీనర్ కోటా), బీ కేటగిరీ ఫీజు రూ.9,93,600 (మేనేజ్మెంట్), సీ కేటగిరీ ఫీజు రూ.57.50 లక్షలు (ఎన్ఆర్ఎ/ ఇన్స్టిట్యూషనల్) గాను నిర్ణయించారు. ఇక పారా క్లీనికల్ డిగ్రీ కోర్సులకు ఏ కేటగిరి ఫీజుగా రూ.1,55,250 (కన్వీనర్), బీ కేటగిరీ ఫీజుగా రూ.3,10,500 (మేనేజ్మెంట్), సీ కేటగిరీ ఫీజుగా రూ.17.25 లక్షలు (ఎన్ఆర్ఎ/ ఇన్స్టిట్యూషనల్), ప్రీ క్లినికల్ డిగ్రీ కోర్సులు ఏ కేటగిరీ ఫీజుగా రూ.70,380 (కన్వీనర్), బీ కేటగిరీ ఫీజుగా రూ.1,40,760 (మేనేజ్ మెంట్), సీ కేటగిరీ ఫీజుగా రూ.9.20 లక్షలు (ఎన్ఆర్ఎ/ఇన్స్టిట్యూషనల్) నిర్ణయించారు. డెంటల్ విభాగంలో క్లినికల్ డిగ్రీ కోర్సులకు ఏ కేటగిరీ ఫీజు రూ.3,41,550 (కన్వీనర్), బీ కేటగిరీ ఫీజు రూ.6,83,100 (మేనేజ్మెంట్), సీ కేటగిరీ ఫీజు రూ.13.80 లక్షలు (ఎన్ఆర్ఎ/ ఇన్స్టిట్యూషనల్)గా నిర్ణయించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read also:

Andhra Pradesh Medical Colleges AP health department BDS Fees Dental College Fees Latest News in Telugu MBBS Fees Medical College Fees PG Medical Courses Super Specialty Courses Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.