📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు

News Telugu: AP: భద్రతకు భారీ పెట్టుబడి.. పోలీసు శాఖలో రూ.1000 కోట్ల ప్రాజెక్టులు

Author Icon By Rajitha
Updated: December 15, 2025 • 1:00 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ మౌలిక వసతుల అభివృద్ధి కోసం సుమారు రూ.1000 కోట్ల విలువైన ప్రాజెక్టులు సిద్ధంగా ఉన్నాయి అని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత (Vangalapudi anitha) వెల్లడించారు. గత ఐదేళ్లలో మోడల్ పోలీస్ స్టేషన్ల నిర్మాణం పూర్తిగా ఆగిపోయిందని, 2019కి ముందు తమ ప్రభుత్వ హయాంలో నిర్మించిన పోలీస్ స్టేషన్లను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినట్లు మంత్రి విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మళ్లీ మోడల్ పోలీస్ స్టేషన్ల నిర్మాణానికి వేగం పెంచామన్నారు.

Read also: VandeBharat: నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం..షెడ్యూల్, స్టాప్స్, టికెట్ ధరలు ఇవే

Massive investment in security

రూ.412 కోట్లతో గ్రేహౌండ్స్ భవనాల నిర్మాణం

సోమవారం ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా కళ్యాణం శివ శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు. మంత్రి అనిత ప్రకారం, ఇప్పటికే రూ.509 కోట్లతో పలు పోలీస్ భవనాల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. త్వరలో రూ.179 కోట్లతో కొత్త భవన నిర్మాణాలు, రూ.412 కోట్లతో గ్రేహౌండ్స్ భవనాల నిర్మాణం ప్రారంభించనున్నారు. కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో కార్యాలయాలు లేవని, వాటి నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని మంత్రి స్పష్టం చేశారు.

నూతన ఛైర్మన్ కళ్యాణం శివ శ్రీనివాస్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. గత ప్రభుత్వంలో ఏవైనా నిర్మాణాలు జరగలేదని విమర్శించారు. హోంమంత్రి మరియు ఉన్నతాధికారుల సహకారంతో రెండు సంవత్సరాల లోపే అన్ని ప్రాజెక్టులను పూర్తిచేసి, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్‌కు మంచి పేరు తీసుకొస్తానని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, జనసేన ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

AP Politics latest news Police Department AP Telugu News Vangalapudi Anita News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.