📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక వరుసగా 3 రోజులు సెలవులు మెట్రోకు స్కైవాక్‌లు ఈ రోజు బంగారం ధరలు ఆధార్ కార్డు పోయిందా..? ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత WHO నుంచి వైదొలిగిన అమెరికా ఆస్కార్‌ నామినేషన్స్‌ CBIలో 350 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 859 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 16 నాన్-టీచింగ్, 10 టీచింగ్ పోస్టుల భర్తీ రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక వరుసగా 3 రోజులు సెలవులు మెట్రోకు స్కైవాక్‌లు ఈ రోజు బంగారం ధరలు ఆధార్ కార్డు పోయిందా..? ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత WHO నుంచి వైదొలిగిన అమెరికా ఆస్కార్‌ నామినేషన్స్‌ CBIలో 350 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 859 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 16 నాన్-టీచింగ్, 10 టీచింగ్ పోస్టుల భర్తీ

AP: మంతెన సత్యనారాయణ అనూహ్య నిర్ణయం

Author Icon By Aanusha
Updated: January 25, 2026 • 7:41 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రముఖ యోగా, ప్రకృతి వైద్య నిపుణుడు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు (Dr. Manthena Satyanarayana Raju) తన ప్రభుత్వ పదవికి సంబంధించి ఒక ఆదర్శవంతమైన నిర్ణయం తీసుకున్నారు. గతేడాది డిసెంబర్‌లో సీఎం చంద్రబాబు.. మంతెన సత్యనారాయణ రాజును (AP) రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమించిన విషయం తెలిసిందే. బిల్ గేట్స్ ఫౌండేషన్‌తో కలిసి ప్రభుత్వం చేపడుతున్న ‘సంజీవని’ వంటి ఆరోగ్య కార్యక్రమాలను ప్రజల్లోకి సమర్థంగా తీసుకెళ్లేందుకు ఆయన సలహాలు తీసుకోవాలని సీఎం భావించారు. ఈ నేపథ్యంలో మంతెనతో సీఎం చంద్రబాబు దాదాపు 20 నిమిషాల పాటు చర్చించి, పదవిని చేపట్టాలని కోరారు.

Read Also: Nellore Municipal Schools: నెల్లూరు స్కూళ్లపై మంత్రి నారాయణ స్పెషల్ ఫోకస్

అయితే, ఈ పదవిని స్వీకరించడానికి తాను మొదట విముఖత చూపినట్లు మంతెన తెలిపారు. కేవలం తెరవెనుక ఉండి సలహాలు ఇస్తానని చెప్పగా, అధికారిక హోదా ఉంటేనే సూచనలకు విలువ ఉంటుందని, పనులు వేగంగా జరుగుతాయని సీఎం చంద్రబాబు నచ్చజెప్పినట్లు వివరించారు. ముఖ్యమంత్రి కోరికను కాదనలేక పదవిని స్వీకరించడానికి అంగీకరించినప్పటికీ, తాను కొన్ని కఠినమైన షరతులు విధించినట్లు మంతెన పేర్కొన్నారు.

సదుపాయాలను తీసుకోను

దీనికి స్పందనగా మంతెన తన అభిప్రాయాలను వెల్లడించారు. తాను ఏ హోదాలు, పోస్టులు తీసుకోకూడదనే నియమాన్ని పెట్టుకున్నానని వివరించారు. తాను వెనుక ఉండి ప్రభుత్వానికి సలహాలు, సూచనలు అందిస్తానని, ప్రభుత్వ సహకారం ఉంటే తాను చేస్తున్న పనికి రెట్టింపు ఉత్సాహంతో, ఎక్కువ సమయాన్ని కేటాయించి సేవ చేస్తానని పేర్కొన్నారు. అయితే, హోదా లేకపోతే మాటలకు గౌరవం ఉండదని, ఆచరణలోకి వెళ్లదని, పదవిలో ఉండి చెబితే అమలుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ముఖ్యమంత్రి వివరించారు.

AP: Mantena Satyanarayana’s unexpected decision

దీనివల్ల ప్రయోజనం ఎక్కువగా ఉంటుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. దీంతో.. మంతెన తాను సలహాదారుగా ఉండాలంటే, క్యాబినెట్ హోదాతో వచ్చే ఏ సదుపాయాలనూ తాను తీసుకోనని స్పష్టం చేశారు. ఇందులో నెల జీతం, ప్రభుత్వ కారు, ఇతర ఖర్చులు, ఇంట్లో సహాయకుల జీతాలు, విమాన, రైలు టిక్కెట్లు, కార్యాలయ సదుపాయాలు వంటివి ఏవీ స్వీకరించనని స్పష్టం చేసారు. చివరకు మంతెన అభిప్రాయాలకు ముఖ్యమంత్రి అంగీకరించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

AP Government Dr Manthena Satyanarayana Raju latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.