తెలుగు సినిమా, సాహిత్యం, కళల వైభవాన్ని చాటిచెప్పేలా నిర్వహణ
సచివాలయం : తెలుగు సినిమా, సాహిత్యం, కళల వైభవాన్ని(AP) చాటిచెప్పేలా కూటమి ప్రభుత్వం విజయవాడ వేదికగా జనవరి 8 నుంచి 10వ తేది వరకు ఆవకాయ సినిమా సంస్కృతి, సాహిత్యోత్సవం పేరిట వినూత్న సాంస్కృతిక వేదికను ఏర్పాటు చేసిందని పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. సోమవారం వెలగపూడి సచివాలయం 4వ బ్లాక్ లోని పబ్లిసిటీ సెల్ విభాగంలో మంత్రి కందుల దుర్గేష్, పర్యాటక శాఖ సెక్రటరీ అజయ్ జైన్, ఏపిటివి సీఈవో, ఏపిటిడిసి ఎండి అమ్రపాలి కాట, టీమ్ వర్క్ ఆర్ట్స్ కంపెనీ ప్రొడ్యూసర్ శ్యామ్ కలసి ఆవకాయ సినిమా సంస్కృతి, సాహిత్యోత్సవం పై పలు అంశాలను వివరించారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మరియు టీమ్ వర్క్ ఆర్ట్స్ సంయుక్తాధ్వర్యంలో 2026 జనవరి 8 నుంచి 10వరకు మూడురోజుల పాటు విజయవాడలోని కృష్ణానది ఒడ్డున ఉన్న పున్నమి ఘాట్, భవాని ఐలాండ్లో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు మంత్రి దుర్గేష్ వివరించారు.
Read Also: AP Government: క్రైస్తవుల భద్రతకు భంగం రానివ్వం: సిఎం చంద్రబాబు
సాంస్కృతిక మార్పిడికి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్
రాష్ట్రంలోని సుసంపన్నమైన కథా సాంప్రదాయాలు, సినిమా, సాహిత్యం, ప్రదర్శన కళలను ఘనంగా చాటాలన్న లక్ష్యంతో సీఎం చంద్రబాబు(CM Chandrababu) నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దార్శనికతలో భాగంగా ఈ ఉత్సవం రూపుదిద్దుకుందన్నారు. సినిమా, సాహిత్యం, సంగీతం, నాటకరంగం, సాంస్కృతిక చర్చలను ఒకే బహిరంగ వేదికపైకి తెచ్చి ఆంధ్రప్రదేశ్ను సాంస్కృతిక మార్పిడికి, కళాత్మక భాగస్వామ్యానికి ఒక శక్తివంతమైన గమ్యస్థానంగా మార్చడమే లక్ష్యంగా అమరావతి ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విజయవాడ ఒక గొప్ప సాంస్కృతిక గమ్యస్థానంగా ఎదగడానికి, అలాగే రాష్ట్రవ్యాప్తంగా పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి ఈ ఉత్సవం ఎంతగానో దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి పాత్రికేయులను ఆహ్వానించారు. పాత్రికేయులు తమ పాత్రికేక వృత్తి పరిణామ క్రమాన్ని కార్యక్రమంలో తెలియజేయాలని సూచించారు. గత ప్రభుత్వంలో కళలను నిర్లక్ష్యం చేశారని, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కళా, సాంస్కృతిక రంగాలకు పునరుజ్జీవం కల్పించిందని అన్నారు.
దీర్ఘకాలిక పర్యాటక లక్ష్యాలకు దోహదం
బహుళ కళారూపాలను బహిరంగ ప్రదేశాలతో మరియు ప్రజా భాగస్వామ్యంతో అనుసంధానించే సమగ్ర సాంస్కృతిక చొరవగా “ఆవకాయ”ను తీర్చిదిద్దామని పర్యాటక శాఖ ప్రత్యేక కార్యదర్శి అజయ్ జైన్ అన్నారు. నది తీర ప్రాంతాల్లో విస్తరించి ఉన్న ఈ కార్యక్రమం చర్చలు, ప్రదర్శనలు, అభ్యాసాలను అందరికీ అందుబాటులో ఉండేలా చేస్తుందన్నారు. సమకాలీన సృజనాత్మకతను పెంపొందించడానికి, దీర్ఘకాలిక పర్యాటక లక్ష్యాలకు అనుగుణంగా స్థిరమైన సాంస్కృతిక వ్యవస్థను నిర్మించడానికి ఇటువంటి కార్యక్రమాలు చాలా అవసరమన్నారు. జనవరిలో గండికోట, అరకు, విశాఖ, ప్లెమింగో ఉత్సవ్లను నిర్వహిస్తామన్నారు.
పర్యాటక రంగాన్ని బలోపేతంకు ఆవకాయ్ దోహదం
సినిమా, సాహిత్యం, ప్రదర్శన కళలతో కూడిన బహుముఖ కార్యక్రమాల ద్వారా ఆంధ్రప్రదేశ్ యొక్క సాంస్కృతిక, సృజనాత్మక బలాన్ని ప్రదర్శించడానికి “ఆవకాయ” రూపొందించబడిందని ఏపిటిడిసి ఎండి అమ్రపాలి అన్నారు. ఈ సాంస్కృతిక అనుభవాలు పర్యాటక రంగాన్ని బలోపేతం చేయడమే కాకుండా నేటి తరం ప్రేక్షకులకు కూడా ఎంతో ఆసక్తిని కలిగిస్తాయన్నారు.
ఆవకాయ ఉత్సవం ఈ ప్రాంతపు ఆలోచనలు, కథలు మరియు ప్రదర్శనలను ఒకచోట చేర్చే ఒక బహిరంగ సాంస్కృతిక వేదిక అని టీమ్ వర్క్స్ ఆర్ట్స్ మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ కె. రాయ్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక చైతన్యాన్ని ప్రతిబింబించే వాతావరణంలో సినిమా, సాహిత్యం మరియు కళలను జరుపుకోవడం ఈ పండుగ ప్రత్యేకత. అన్నారు. అవకాయ ఉత్సవాన్ని సాకారం చేయడంలో ఏపి ప్రభుత్వం మద్దతుకు కృతజుతలు తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: