AP Local Body Elections: ఆరు నెలల్లో స్థానిక ఎన్నికలు: మంత్రులకు సీఎం చంద్రబాబు క్లారిటీ!

Read Time:  1 min
AP Local Body Elections
AP Local Body Elections
FONT SIZE
GET APP

AP Local Body Elections: రాష్ట్రంలో ఎప్పుడు ఏ ఎన్నిక జరిగిన ఆ విజయం కూటమికే దక్కాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో 20 నెలల వ్యవధిలో ప్రభుత్వం చేసిన అభివృద్దే మన ప్రభుత్వానికి కీలకమైన అండగా ఉంటుందని వ్యాఖ్యానించారు. స్థానిక సం స్థల ఎన్నికలు 6 నెలల్లో జరగొచ్చు, అందుకు సిద్ధంగా ఉండాలని మంత్రులతో సూచించారు. శుక్రవారం ఏపీ కేబినేట్ సమావేశం అనంతరం ఆయన మంత్రులతో పలు అంశాలపై చర్చించారు. అనేక విషయాల్లో మార్గదర్శనం చేసారుజ. వైఎస్సార్సీపీ చేసిన విధ్వంసాన్ని చెప్తూనే కూటమి ప్రభుత్వం సాధిస్తున్న ప్రగతిని ప్రజలకు వివరించాలన్నారు. ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎన్నిక లల్లో మనం గెలిచామన్న చంద్రబాబు, ఎన్నిక ఏదైనా కూటమిదే గెలుపు కావాలని స్పష్టం చేశారు.

Read Also :BC Protection Act: బీసీ రక్షణ చట్టంపై నేడు కీలక సమావేశం

AP Local Body Elections
AP Local Body Elections: Local Elections Within Six Months — CM Chandrababu Clarifies to Ministers!

పంచాయతీలు మాదిరిగానే నీటిసంఘాలు నీటిపన్నువసూలు చేయాలని మంత్రి రామానాయుడుకు చెప్పారు. చేసిన పనిని మీరు మీడియాకు చెప్పుకోవడంలో విఫలమవుతున్నారని మంత్రులతో వ్యాఖ్యానించారు. మంత్రివర్గంలో అజెం డా అంశాలు ముగిశాక వివిధ అంశాలపై సీఎం మంత్రు లతో చర్చించారు. పశ్చిమాసియా యుద్ధ ప్రభావం వల్ల గ్యాస్ కొరత తలెత్తకుండా నిరంతర పర్యవేక్షణ ఉండా లని సిఎం సూచించారు. కొందరు గ్యాస్కి ప్రత్యామ్నా యంగా ఎలక్ట్రిక్ పొయ్యిలు వాడుతున్నారని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. ఎలక్ట్రిక్ పొయ్యిలు ఎక్కువ వాడితే విద్యుత్ డిమాండ్ పెరిగే అవకాశం ఉన్నందున, విద్యుత్ డిమాండ్ పర్యవేక్షించాలని సీఎం ఆదేశించారు. ఏప్రిల్ 2న శాఖల పనితీరు మీద నివేదిక లు ఇస్తానని ముఖ్యమంత్రి వెల్లడించారు. నివేదికలు ఆధారంగా సమీక్ష చేసుకుని పురోగతి సాధించాలని దిశానిర్దేశం చేశారు. ఏప్రిల్ 2 నుంచి 90 రోజుల పాటు జలాధార కార్యక్రమం చేపట్టాలని సూచించారు.

కాలవులు, డ్రైన్లు శుభ్రం చేయించి భూగర్భ జలం పెంచటమే లక్ష్యంగా జలాధార చేపట్టాలన్నారు. మే 15 కల్లా సాగునీటిని విడుదల చేయాలని ఆదేశించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ నిరక్ష్యం వల్ల దాదాపు 7 లక్షల ఎకరాలకు నీరందలేదన్న సీఎం, చివరి ఎకరాకు నీరిచ్చే దిశగా జలాధార జరగాలని సూచించారు. వరదల వల్ల రేపల్లె వద్ద బలహీనంగా ఉన్న కరకట్టను అభివృద్ధి చేయాలని మంత్రి అనగాని సత్యప్రసాద్ కోరారు. ఈ నెల 16న అమరావతిలో పొట్టిశ్రీరాములు విగ్రహావిష్క రణ చేపడుతున్నామని తెలిపారు. అన్ని జిల్లాల్లోనూ పొట్టిశ్రీరాములు జయంతి ఘనంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.

మంత్రి మండలి సమావేశానికి ఆరుగురు మంత్రులు గైర్హాజరు

వివిధ కారణాల వలన ఆరుగురు మంత్రులు మంత్రివర్గ సమావేశానికి రాలేకపోతున్నామని ముంద స్తు సమాచారం ఇచ్చారు. తీవ్ర అనారోగ్యం వలన మంత్రులు గొట్టిపాటి రవికుమార్, అనిత, టీజీ భరత్ గైర్హాజరు కాగా భార్య సంవత్సరికం వల్ల ఫరుఖ్ కేబినేటకు రాలేకపోయారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవ ఏర్పాట్ల పర్యవేక్షణ వలన ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ కెబినేట్ కు రాలేదు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

Pooja

రచయిత గురించి

Pooja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.