📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రి కొల్లు రవీంద్ర ఏమన్నారంటే?

Author Icon By Anusha
Updated: July 27, 2025 • 11:24 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలన్నీ ఎప్పుడో ఎన్నికల మూడ్‌లోకి వెళ్లిపోయాయి. ముఖ్యంగా తెలుగు దేశం పార్టీ ఆధ్వర్యంలోని ఎన్డీయే కూటమి నాయకులు ఇప్పటికే జిల్లాలవారీగా కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తూ వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు.ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర (Kollu Ravindra) తాజాగా కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని కంకిపాడు ప్రాంతాన్ని సందర్శించారు. అక్కడ జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నందున, ప్రతి పార్టీ కార్యకర్త కూడా అలర్ట్‌గా ఉండాలని పిలుపునిచ్చారు.

AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రి కొల్లు రవీంద్ర ఏమన్నారంటే?

నామినేషన్ దాఖలు చేసేందుకు అవకాశం కల్పిస్తోంది

గత ప్రభుత్వం చేసిన అరాచకాలను ప్రజలు గుర్తు పెట్టుకున్నారని, మళ్లీ వైసీపీకి అధికారం ఇచ్చేందుకు ప్రజలు సిద్ధంగా లేరని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు.రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు గాను ఎన్నికల సంఘం (Election Commission) ఈ-సేవ పేరుతో ఏర్పాట్లు చేస్తోంది. అభ్యర్థులు ఇంటి నుంచే నామినేషన్ దాఖలు చేసేందుకు అవకాశం కల్పిస్తోంది. అలానే ఎన్నికల ఫలితాలను సైతం మొబైల్ అప్లికేషన్ల ద్వారా తెలుసుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటుంది. దీంతో పాటు ఓటర్ల నమోదు, ఓటరు లిస్టు, పోటీ చేసే అభ్యర్థుల జాబితా, నామినేషన్ల లిస్టు, పోలింగ్ కేంద్రాలు వంటి అంశాలను కూడా ప్రజలకు తెలిపేందుకుగాను కొత్త సాఫ్ట్‌వేర్‌ను తీసుకొచ్చే పనిలో ఉంది. ఈ ప్రక్రియ పూర్తి అయిన వెంటనే ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేసే అవకాశం ఉందని అంటున్నారు. అంటే ఈ ఏడాది చివర్లో లేదంటే వచ్చే ఏడాది ప్రారంభంలో కానీ ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని సమాచారం.

కొల్లు రవీంద్ర ఏ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు?

ఆయన మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

కొల్లు రవీంద్ర ఏ రాజకీయ పార్టీకి చెందారు?

కొల్లు రవీంద్ర గారు తెలుగుదేశం పార్టీ సభ్యుడు. ఆయన TDP నాయుకత్వంలో ప్రముఖ స్థానాన్ని పొందారు.

Read hindi news: hindi.vaartha.com

Read also: Andhra Pradesh: రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరికి ఉచిత బస్సు :మంత్రి అచ్చెన్నాయుడు

Andhra Pradesh politics 2025 AP local elections campaign Breaking News Kollu Ravindra latest news Kollu Ravindra speech latest news local body elections AP Penamaluru politics TDP local election strategy Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.