📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్..రెండో ఛార్జ్‌షీట్‌లో కీలక ఆధారాలు

Author Icon By Sharanya
Updated: August 11, 2025 • 7:36 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఏపీ లిక్కర్ (AP Liquor Scam)కుంభకోణంపై సిట్ దర్యాప్తు వేగం పెంచింది. ఇప్పటికే ఒక ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన సిట్ అధికారులు తాజాగా రెండోసారి కోర్టును ఆశ్రయించారు. ఏసీబీ ప్రత్యేక కోర్టులో 200 పేజీలతో కూడిన మరో ఛార్జ్‌షీట్‌ (Charge sheet) ను వారు ప్రవేశపెట్టారు.

ముగ్గురు కీలక నిందితులపై ఆధారాలతో కూడిన వివరణ

ఈ ఛార్జ్‌షీట్‌లో బాలాజీ గోవిందప్ప, ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి పాత్రలపై ప్రత్యేకంగా వివరించారు. వారి మధ్య కమ్యూనికేషన్, టెక్నాలజీ ఆధారాల ఆధారంగా వారి ప్రమేయాన్ని బలంగా నిలబెట్టే ప్రయత్నం చేశారు.

AP Liquor Scam

కాల్ డేటా, గూగుల్ టేకౌట్, ల్యాప్‌టాప్ సమాచారం కీలకం

నిందితుల కాల్స్ డేటా రికార్డులు, గూగుల్ టేకౌట్ ఫైల్స్, ల్యాప్‌టాప్ డేటా సిట్ దృష్టికి వచ్చాయని పేర్కొంది. ఈ ఆధారాల ద్వారా వారు ఎవరెవరితో మాట్లాడారు, ఎప్పుడు మాట్లాడారు అన్న సమాచారం స్పష్టంగా వెల్లడించబడింది.

లిక్కర్ పాలసీ రూపకల్పనలో ధనుంజయ్ రెడ్డి పాత్ర కీలకం

ధనుంజయ్ రెడ్డి (Dhanunjay Reddy) లిక్కర్ పాలసీ (AP Liquor Scam) రూపకల్పనలో ప్రతి దశలో జోక్యం చేసుకున్నారని సిట్ పేర్కొంది. పాలసీ ఎలా ఉండాలి, ఎవరికి అనుకూలంగా ఉండాలి వంటి అంశాల్లో ఆయన అనైతికంగా మద్దతు ఇచ్చారని ఆరోపించింది. సిట్ ఛార్జ్‌షీట్‌లో నిందితులు ఎవరెవరి వద్ద నుంచి ఎన్ని ముడుపులు తీసుకున్నారు?, ఆ డబ్బు ఎవరెవరికి చేరింది? అనే విషయాలను స్పష్టంగా ప్రస్తావించింది. ఈ అంశంలో స్పష్టతతో ఆధారాలను జోడించడంతో కేసు మరింత బలపడనుంది.

ప్రముఖ నేతలతో ఫోన్ సంభాషనలు కూడా ప్రస్తావనలోకి

విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డిలతో నిందితులు ఫోన్ సంభాషించినట్లు పేర్కొంటూ, వాటి కాల్ రికార్డులు సేకరించామని సిట్ తెలిపింది. వీటిలో ఉన్న అంశాలు విచారణకు కీలకంగా మారే అవకాశం ఉంది. నిందితులు బినామీ పేర్లతో వ్యాపార పెట్టుబడులు పెట్టినట్టు గుర్తించారని, ఈ విషయానికి సంబంధించి సాక్ష్యాలతో కూడిన ఆధారాలు కూడా రెండో ఛార్జ్‌షీట్‌లో పొందుపరిచారని సమాచారం.

ఇప్పటికే దాఖలైన మొదటి ఛార్జ్‌షీట్‌

గతంలో, జూలై 19న సిట్ అధికారులు 305 పేజీలతో కూడిన తొలి ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. తాజా ఛార్జ్‌షీట్‌లో మరిన్ని న్యాయపరమైన బలాన్ని కలిగించే అంశాలు ఉన్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/road-accident-srisailam-apsrtc-buses-collision/andhra-pradesh/529091/

AP liquor scam Balaji Govindappa Breaking News Corruption Cases Dhanunjay Reddy Krishna Mohan Reddy latest news SIT Charge Sheet Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.