📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

AP Liquor Scam: అక్రమ మద్యం పై మంత్రి  లోకేశ్ విమర్శలు

Author Icon By Saritha
Updated: March 7, 2026 • 3:33 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

AP Liquor Scam: ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమ మద్యం వ్యవహారంపై రాష్ట్ర విద్యుత్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లక్ష్యంగా ఘాటు విమర్శలు చేశారు.

గత ఐదేళ్లలో అక్రమ మద్యం కారణంగా రాష్ట్రంలో వేల సంఖ్యలో కుటుంబాలు రోడ్డున పడ్డాయని సామాన్యుల జీవితాలు చితికిపోతుంటే, మరోవైపు జగన్ అనుచరులు మాత్రం వేల కోట్లు వెనకేసుకున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ఖజానాకు రావాల్సిన ఆదాయాన్ని వ్యక్తిగత జేబుల్లోకి మళ్లించారని మండిపడ్డారు.

Read Also: AP Egg Prices Fall: ఏపీలో భారీగా పడిపోయిన కోడిగుడ్ల ధరలు

AP Liquor Scam: Minister Lokesh criticizes illegal liquor

మౌనమే సమాధానమా?

అక్రమ మద్యం వ్యాపారంలో జరిగిన కోట్ల రూపాయల నగదు లావాదేవీలకు సంబంధించిన పక్కా ఆధారాలను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) బయటపెట్టిందని లోకేశ్ గుర్తు చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థల వద్ద అన్ని సాక్ష్యాలు ఉన్నాయని, ఇప్పుడు జగన్ ఏం సమాధానం చెబుతారని ఆయన ప్రశ్నించారు. ఈ దోపిడీలో జగన్ పాత్రపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఇంత పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వస్తున్నా జగన్ ఎందుకు మౌనంగా ఉన్నారని లోకేశ్ నిలదీశారు. “ఈ అక్రమాలపై జగన్ ప్రజలకు సమాధానం చెప్పగలరా? లేక ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండటమే ఆయన సమాధానమా?” అని నిలదీశారు. తప్పు చేసిన వారు చట్టానికి దొరకక తప్పదని ఆయన మండిపడ్డారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

AP liquor scam Illegal Liquor Allegations Latest News in Telugu Nara Lokesh Telugu News YS Jagan

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.