ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన లిక్కర్ స్కామ్ (AP Liquor Scam)కేసులో మరో కీలక మలుపు తిరిగింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy) కుటుంబానికి చెందిన సంస్థపై విచారణ తీవ్రతరమైంది.
హైదరాబాద్‌లో భారతి సిమెంట్స్ కార్యాలయంలో సోదాలు
శనివారం నాడు హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఉన్న భారతి సిమెంట్స్ కార్యాలయంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విస్తృత సోదాలు నిర్వహించింది. ఈ సంస్థలో పూర్తికాలిక డైరెక్టర్‌గా ఉన్న గోవిందప్ప బాలాజీ, లిక్కర్ స్కామ్ (AP Liquor Scam) ప్రధాన నిందితుడిగా విచారణ ఎదుర్కొంటున్న నేపథ్యంలో, ఆయన ఛాంబర్‌ను అధికారులు తనిఖీ చేశారు.
సీసీ టీవీ ఫుటేజ్, కీలక పత్రాలు స్వాధీనం
భారతి సిమెంట్స్ కార్యాలయంలోని గోవిందప్ప బాలాజీ ఛాంబర్‌లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్, పలు కీలక పత్రాలను సిట్ బృందం స్వాధీనం చేసుకుంది. బాలాజీ నివాసమైన బంజారాహిల్స్‌లోని ఇంటినీ అధికారులు సోదాలు చేసి కీలక ఆధారాలు సేకరించారు. దర్యాప్తులో భాగంగా, రాజ్ కెసిరెడ్డి అర్ధాంగి సోదరి పైరెడ్డి మేఘనా ప్రియదర్శిని రెడ్డి ఎండీగా ఉన్న “రిసోర్స్ వన్ ఐటీ సొల్యూషన్స్” కార్యాలయం, అలాగే చాణక్య యజమానిగా ఉన్న “టీ గ్రిల్స్ రెస్టారెంట్” కార్యాలయంలోనూ సిట్ అధికారులు తనిఖీలు నిర్వహించారు.
రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారిన ఘటన
వైఎస్ జగన్ కుటుంబానికి చెందిన సంస్థగా పేరు ఉన్న భారతి సిమెంట్స్ కార్యాలయంలో సిట్ దాడులు జరిపిన నేపథ్యంలో, ఈ వ్యవహారం రాజకీయంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. లిక్కర్ స్కామ్ దర్యాప్తులో ఇది కీలక దశగా పరిగణించబడుతోంది.
Read hindi news: hindi.vaartha.com
Read also: Minister Atchannaidu: మహిళలకు ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం