ఎపి లిక్కర్ స్కాం కేసు
AP Liquor Scam: ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితుడైన ముప్పిడి అవినాశ్ రెడ్డికి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. అవినాశ్ కు సుప్రీం కోర్టు రెగ్యులర్ బెయిల్ను మంజూరు చేసింది. మద్యం కుంభకోణం కేసులో ఏ7గా ఉన్న అవినాశ్ రెడ్డిని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) మూడు రోజుల పాటు కస్టడీలోకి తీసుకుంది. కోర్టు అనుమతితో జరిగిన ఈ విచారణలో అవినాశ్ కీలక విషయాలు వెల్లడించినట్లు సమాచారం. మద్యం కుంభకోణంలో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి పాత్ర, అంతిమ లబ్ధిదారుడికి సంబంధించిన విషయాలపై అవినాశ్ రెడ్డి వివరాలు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ స్కామ్లో రాజ్ కసిరెడ్డి ప్రధాన నిందితుడిగా ఉండగా, అవినాశ్ రెడ్డి ఆర్థిక నియంత్రణ, లావాదేవీలలో ముఖ్యపాత్ర వహించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసుకు సంబంధించి విచారణ ఇంకా కొనసాగుతోంది.
Read Also : Nadendla Manohar: వంటగ్యాస్ సమస్యలేదు.. మంత్రి నాదెండ్ల
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :