ఆంధ్రప్రదేశ్‌లో(AP) నిమ్మకాయ ధరలు భారీగా పడిపోయాయి. ధరలు పడిపోవడంతో, రైతులు తీవ్ర నిరాశలో ఉన్నారు.. నెల్లూరు జిల్లా(Nellore) గూడూరు, పొదలకూరు, నంద్యాల జిల్లాలోని నిమ్మ మార్కెట్‌లలో 80 కేజీల బస్తా రకాన్ని బట్టి రూ.500 నుంచి రూ.1,000 మాత్రమే పలుకుతోంది. కిలోకు రూ.6-12 మాత్రమే వస్తుండటంతో తీవ్రంగా నష్టపోతున్నామని అన్నదాతలు వాపోతున్నారు.
Read also: బిస్కెట్లను తినడం మంచిదేనా..?
నంద్యాల జిల్లాలో నిమ్మ పంట రైతులకు నష్టం
గతేడాది(AP) ఇదే సమయంలో కేజీ రూ.40 వరకు పలికిందని చెబుతున్నారు. రైతులు మంచి లాభాలను పొందారు. అందువల్ల ఈ ఏడాది కూడా కొంతమంది రైతులు పండ్ల ఉత్పత్తి పెంచారు. కానీ, సీజన్ లో, దిగుబడి వచ్చినా, ధర లేకపోవడంతో అల్లాడిపోతున్నారు. ప్రతి ఏకరాకు రూ. 50 నష్టం వాటిల్లుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నంద్యాల జిల్లాలో సుమారు మొత్తం 110 ఎకారల్లో నిమ్మ పంట సాగుచేశామని తెలిపారు. ఎకరానికి రూ. 50 వేలు కాగా కోత, కూలి మరో రూ.50 వేలు ఖర్చు అయిందని చెప్పారు. తీరా అమ్ముకునే సరికి రూ.30 వేల నుంచి 40 వేలు మాత్రమే వస్తోందని, ఎకరానికి సరాసరి రూ.50 వేలు నుంచి 60 వేల వరకూ నష్టపోతున్నామని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: