AP land registration: ఆంధ్రప్రదేశ్‌లో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ని మరింత సులభతరం చేసేందుకు కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రూ.10 లక్షల వరకు విలువ గల వారసత్వ ఆస్తులను రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కేవలం రూ.100 మాత్రమే ఫీజు వసూలు చేయబడుతుంది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సాఫ్ట్‌వేర్ సిస్టమ్ (Software system)ను అప్‌డేట్ చేశారు.
Read Also: AP Government: బియ్యం, చక్కెరతోపాటు రాగులు, గోధుమ పిండి
చిన్న, సన్నకారు రైతులకు లాభదాయక నిర్ణయం
రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రకారం, మంగళవారం నుంచి కొత్త ఫీజు విధానం అమల్లోకి వచ్చింది. కొన్నిచోట్ల ఇప్పటికే రిజిస్ట్రేషన్లు(AP land registration) పూర్తయిన విషయాన్ని కూడా ఆయన తెలిపారు. అయితే, వారసత్వ ఆస్తుల విలువ రూ.10 లక్షలు మించి ఉంటే రిజిస్ట్రేషన్ ఫీజు రూ.1,000గా వసూలు చేయబడనుంది.
ఈ నిర్ణయం రాష్ట్రంలోని చిన్న, సన్నకారు రైతులకు ప్రత్యేకంగా లాభదాయకమని మంత్రి తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: