ఆంధ్రప్రదేశ్‌లో(AP) కొత్త విమానాశ్రయాల ఏర్పాటుపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. తాజాగా కేంద్రమంత్రి కొత్త ఎయిర్‌పోర్టులపై కీలక ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాడేపల్లిగూడెంలో కొత్త విమానాశ్రయం నిర్మించే అవకాశాలపై అధ్యయనం చేయాలని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI)ను కోరిందని.. ఈ నెలలోనే ఈ అభ్యర్థన చేసినట్లు కేంద్రమంత్రి మురళీధర్ మోహోల్ తెలిపారు. విమానాశ్రయం కోసం అవసరమైన స్థలం వివరాలను రాష్ట్ర ప్రభుత్వం ఏఏఐకి అందించినట్లు తెలిపారు. లోక్‌సభలో వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు.
Read Also: CM Chandrababu Naidu: రేపు కుప్పం పర్యటనలో ఈ-సైకిళ్ల పంపిణీ
కేంద్ర పరిశీలనలో ఎయిర్‌పోర్ట్ నిర్మాణ ప్రతిపాదనలు
ఏఏఐ ఇప్పటికే (AP) కుప్పం, శ్రీకాకుళం, ఒంగోలు ప్రాంతాల్లో విమానాశ్రయాల నిర్మాణానికి సంబంధించిన ప్రాథమిక అధ్యయనాలను పూర్తి చేసినట్లు కేంద్రమంత్రి మురళీధర్ మోహోల్ తెలిపారు. ఈ మూడు చోట్ల విమానాశ్రయాలు నిర్మించడానికి అవసరమైన భూమి అనుమతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్స్ విధానం కింద పౌరవిమానయాన శాఖకు ప్రతిపాదనలు సమర్పించింది. ప్రస్తుతం ఈ ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నట్లు తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: