📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్

Latest News: AP Govt: కాశీబుగ్గ తొక్కిసలాట.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం..

Author Icon By Aanusha
Updated: November 2, 2025 • 10:29 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

శ్రీకాకుళం (Srikakulam) జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కాశీబుగ్గలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో ఏకాదశి పర్వదినం సందర్భంగా జరిగిన తొక్కిసలాట (Kashibugga stampede) లో 9 మంది భక్తులు దుర్మరణం చెందారు. ఈ దుర్ఘటనలో మరో 16 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఏకాదశి కావడంతో ఆలయానికి ఊహించని రీతిలో భక్తులు పోటెత్తడమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది.

Read Also: AP: పంచాయతీరాజ్ శాఖలో1500 మందికి పైగా ప్రమోషన్

ఈ నేపథ్యంలో బాధితుల కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Govt) పరిహారం ప్రకటించింది. మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) కాశీబుగ్గ ఆలయాన్ని సందర్శించారు. ఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. గాయపడి పలాస ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి నారా లోకేష్.. కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం తరుఫున పరిహారం ప్రకటించారు.

ప్రధాని కార్యాలయానికి కూడా సమాచారం

మృతుల కుటుంబాలకు రూ.15 లక్షలు, గాయపడిన వారికి రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించారు.ఈ ఘటనపై ప్రధాని కార్యాలయానికి కూడా సమాచారం అందించామని, వారు కూడా స్పందించి మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున సాయం ప్రకటించారని లోకేశ్ తెలిపారు.

మృతుల్లో ముగ్గురు తెలుగుదేశం పార్టీ సభ్యులు ఉన్నారని, పార్టీ ప్రమాద బీమా పథకం ద్వారా వారి కుటుంబాలకు అదనంగా రూ.5 లక్షల చొప్పున సాయం అందిస్తామని వెల్లడించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

Ap govt Breaking News latest news Nara Lokesh Srikakulam stampede Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.