AP Junior Colleges: రాష్ట్రంలో జూనియర్ కళాశాలలు ఏప్రిల్ ఒకటో తేదీన పునఃప్రారంభం కానున్నాయి. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు రాసి రెండో ఏడాదిలోకి వచ్చిన విద్యార్థులకు ఏప్రిల్ ఒకటి నుంచి 23 వరకు తరగతులు నిర్వహిస్తారు. 24 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు ఇస్తారు. 2025-26 విద్యాసంవత్సరం నుంచి ఇంటర్మీడియట్లో ఎన్సీఈఆర్టీ సిలబస్ ను ప్రవేశపెట్టి, సీబీఎస్ ఈ విధానాన్ని పాటిస్తున్నారు. దీంతో పబ్లిక్ పరీక్షల తర్వాత ఏప్రిల్లో తరగతులు నిర్వహించి, ఆ తర్వాత వేసవి సెలవులు ఇచ్చేలా విద్యా ప్రణాళిక రూపొందించారు.
Read Also: Panchayat Voter List: పంచాయతీల్లో ఓటర్ల జాబితాలు ప్రచురించాల్సిందే

2026-27 అకడమిక్ కేలండర్ విడుదల
2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి అకడమిక్ కేలండర్ను బుధవారం ఇంటర్మీడియట్ విద్యా మండలి కార్యదర్శి రంజిత్ బాషా విడుదల చేశారు. విద్యా సంవత్సరంలో మొత్తం 232 రోజులు కళాశాలలు పని చేయనున్నాయి. విద్యార్థుల ప్రవేశాల కోసం పబ్లిక్ పరీక్షల్లో ఉత్తీర్ణత, ర్యాంకుల గ్యారెంటీపై ప్రైవేటు జూనియర్ కళాశాలలు ప్రచారం చేయడం చట్ట విరుద్ధమని, కళాశాలల మధ్య అనారోగ్యకరమైన పోటీని సృష్టించే హోర్డింగ్లు, కరపత్రాలు పంపిణీ, గోడలపై రాతలు, ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాలో ప్రకటనలు ఇవ్వరాదని కార్యదర్శి రంజిత్ బాషా ఆదేశించారు. వేసవి సెలవుల అనంతరం జూన్ 1న జూనియర్ కళాశాలలు పునఃప్రారంభమవుతాయి. అక్టోబరు 5 నుంచి 9వరకు త్రైమాసిక పరీక్షలు. దసరా సెలవులు అక్టోబరు 10-20. అర్థ సంవత్సరం పరీక్షలు నవంబరు 25-30, సంక్రాంతి సెలవులు జనవరి 9-17 ప్రీఫైనల్ పరీక్షలు జనవరి 19-23. ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు-ఫిబ్రవరి. థియరీ పబ్లిక్ పరీక్షలు- ఫిబ్రవరి/మార్చి. 2026-27 చివరి వర్కింగ్ డే మార్చి 18 ఉంటుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: