📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest news: AP: జోగి రమేష్ పై మరిన్ని కేసులు!

Author Icon By Saritha
Updated: November 19, 2025 • 11:56 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయవాడ : (AP) మాజీ మంత్రి జోగి రమేష్(Jogi Ramesh) పై పోలీసులు మరిన్ని కేసులు నమోదు చేసే దిశలో కీలక సాక్ష్యాధారాలు సేకరిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆయన అనుచరులు అయిదుగురిపై ఈ కేసులు నమోదు చేసారు. ఈ కేసుల్లో జోగిని నిందితునిగా నమోదు చేసేందుకు అవసరమైన సాక్ష్యాలు పోలీసులు దగ్గర ఉన్నాయంటున్నారు. కృత్తివెన్ను మండలం ఇంతేరులోని మడ, పంచాయతీ భూములను ప్రైవేటు భూములని చెప్పి పలువురు నుంచి రూ.90లక్షలు వసూలు చేసిన వైనంపై ఆయన అనుచరులు ఐదు గురిపై కృత్తివెన్ను పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. నరసాపురానికి చెందిన తమ్ము కల్యాణ్కుమార్ ఫిర్యాదు మేరకు కృత్తివెన్ను జడ్పీటీసీ మైలా రత్నకుమారి, జోగి ప్రధాన అనుచరుడు శ్రీనివాసరెడ్డి, మైలా రమేశ్, మైలా మహేశ్రరాజు, వై.వెంకటరాజుపై ఐపీసీ సెక్షన్లు 420, 386, 506 రెడ్ విత్ 34 కింద కేసు కట్టారు. ఇంతేరులో సర్వే నం.94లోని 30 ఎకరాల మడ, పంచాయతీ భూమిని ప్రైవేటు భూమి అని చెప్పి ఎకరం రూ.3 లక్షలకే ఇస్తున్నామంటూ బేరం పెట్టారు. ఒక్కొక్కరికి 2.5 ఎకరాలు అగ్రిమెంట్ చేస్తామని 12 మంది నుంచి రూ.7.50 లక్షలు చొప్పున వసూలు చేశారు.

Read also: హైదరాబాద్ మెట్రో విస్తరణకు కేంద్ర–రాష్ట్ర భాగస్వామ్యం

More cases against Jogi Ramesh!

త్వరలో జోగి రమేష్‌పై కూడా కేసు నమోదు చేసే అవకాశాలు

భూమి తమదేనని నమ్మించేందుకు అగ్రిమెంట్లు చేసుకొని తొలుత అడ్వాన్స్ తీసుకుని జోగి వద్దకు వెళ్లి మాట్లాడాక మిగిలిన డబ్బులు తీసుకున్నారని బాధితులు వాపోతున్నారు. నెలలు గడుస్తున్నా రిజిస్ట్రేషన్ చేయట్లేదని కృత్తివెన్ను తహసీల్దార్ కార్యాలయంలో భూముల గురించి విచారించారు. అవి మడ భూములని తేలడంతో తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని జోగి, ఆయన అనుచరులను అడితే ప్రభుత్వం తమదేనని, ఏదో విధంగా రిజిస్ట్రేషన్ చేయించి ఇబ్బంది లేకుండా చూస్తామని నమ్మించారు. 2021లో ఘటన జరిగినా(AP) అప్పుడు జోగి మంత్రిగా ఉండడం, డబ్బులు అడిగితే చంపుతామంటూ అనుచరులు బెదిరింపులకు దిగడంతో ఎక్కడా ఫిర్యాదు చేయలేదు. ప్రభుత్వం మారాక తమ డబ్బులు ఇప్పించాలని పోలీసులను ఆశ్రయించారు. దీంతో జోగి రమేష్ ఆయన అనుచరుల అరాచకాలు వెలుగులోకి వచ్చాయి. ఆధారాలను బాధితుడు పోలీసులకు అందించారు. త్వరలో జోగిపైనా కేసు నమోదు కానుందని సమాచారం.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read also :

Andhra Pradesh politics Fraud Case jogi ramesh Krittivennu Land Scam police investigation

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.