ఆంధ్రప్రదేశ్ (AP) లో విద్యార్థుల ఉపాధి అవకాశాలను విస్తరించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఈ దిశగా ప్రభుత్వం తాజాగా ‘నైపుణ్యం’ (Naipunyam Digital portal) అనే కొత్త డిజిటల్ పోర్టల్‌ను ప్రారంభించింది.ఈ పోర్టల్ ద్వారా విద్యార్థులు తాము అభ్యసించిన విద్య, సంపాదించిన నైపుణ్యాలకు అనుగుణంగా రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న ఉద్యోగ అవకాశాల వివరాలను సులభంగా తెలుసుకోవచ్చని మంత్రి తెలిపారు.
Read Also: AP: బీసీలకు శుభవార్త.. సూర్య ఘర్ పథకంలో అదనపు ఆర్థిక సహాయం
20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యం
(AP) కూటమి ప్రభుత్వం ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తుందని, “కూటమి ప్రభుత్వం ఐదేళ్లలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా పని చేస్తోందని,” అని మంత్రి (Minister Lokesh) చెప్పారు. జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు.” అని తెలిపారు.
రాజమహేంద్రవరం ఆర్ట్స్ కాలేజీలో జరిగిన కార్యక్రమంలో ఇంక్యుబేషన్ సెంటర్, ప్రధాన ముఖద్వారం, వందేమాతరం ఉద్యానాన్ని ప్రారంభించారు. ఎన్ని కేసులు వేసినా డీఎస్సీ పూర్తి చేసి 16 వేలమందికి ఉద్యోగాలు ఇచ్చామన్నారు. ఇటీవల 6 వేలమందికి కానిస్టేబుల్ ఉద్యోగాలిచ్చామని గుర్తు చేశారు. రాష్ట్రానికి గూగుల్ డేటా సెంటర్, రిలయన్స్ డేటా సెంటర్.. కాగ్నిజెంట్‌లో 25 వేల ఉద్యోగాలు ఇస్తామన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: