Job Calendar 2026: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉద్యోగార్థులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. రాబోయే ఉగాది పండుగను పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ‘జాబ్ క్యాలెండర్’ విడుదల చేస్తామని విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ అసెంబ్లీలో వెల్లడించారు.
Read Also: AP Inter Exams 2026: ఇంటర్ విద్యార్థులకు ఆల్ ది బెస్ట్: లోకేష్
కీలక అంశాలు:
- మెగా డీఎస్సీ అప్డేట్: ఈ జాబ్ క్యాలెండర్లో ప్రధానంగా డీఎస్సీ (DSC) పోస్టుల వివరాలు ఉంటాయని మంత్రి స్పష్టం చేశారు. ఉపాధ్యాయ కొలువుల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇది పెద్ద ఊరట.
- ఉన్నత విద్యకు ప్రాధాన్యత: ఇంజనీరింగ్ విద్యతో పాటు పాలిటెక్నిక్, ఐటీఐ (ITI) కోర్సులకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని, పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా సిలబస్లో మార్పులు చేస్తామని తెలిపారు.
- నైపుణ్యాభివృద్ధి: ఐటీఐలకు అనుబంధంగా అత్యాధునిక శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేస్తామని, ప్రతి నియోజకవర్గంలో జాబ్ మేళాల ద్వారా యువతకు ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు.
- క్లస్టర్ అప్రోచ్: పెండింగ్లో ఉన్న విద్యా సంస్థల పనులను ‘క్లస్టర్ బేస్డ్ అప్రోచ్’ ద్వారా వచ్చే ఏడాది నాటికి పూర్తి చేస్తామని లోకేశ్ వివరించారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: