📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

AP Job Calendar 2026: జాబ్ క్యాలెండర్ 2026 విడుదల.. సీఎం చంద్రబాబు స్పందన ఇదే

Author Icon By Anusha
Updated: March 19, 2026 • 5:14 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

AP Job Calendar 2026: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన వివరాల ప్రకారం, ఈ ఏడాది మొత్తం 10,060 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. వీటి నోటిఫికేషన్లు మే 15, 2026 నుండి అక్టోబర్ 15, 2026 మధ్య విడుదల కానున్నాయి.

Read Also: Nellore Lorry Accident: కూల్‌డ్రింక్స్‌ లారీ బోల్తా.. ఎగబడిన జనం (వీడియో)

ముఖ్యమైన నోటిఫికేషన్ల షెడ్యూల్:

నోటిఫికేషన్ తేదీశాఖ / విభాగంఖాళీల సంఖ్య
మే 15, 2026ఉన్నత విద్యాశాఖ (అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఇతరాలు)1,500
ఆగస్టు 15, 2026ఏపీపీఎస్సీ గ్రూప్-1 (APPSC Group 1)91
ఆగస్టు 15, 2026హోంశాఖ (పోలీస్ కానిస్టేబుల్, వార్డర్లు, సెక్యూరిటీ)2,778
సెప్టెంబర్ 15, 2026ఏపీపీఎస్సీ గ్రూప్-2 (APPSC Group 2)750
సెప్టెంబర్ 15, 2026ఇంజనీరింగ్ & పబ్లిక్ వర్క్స్ (AEE మరియు ఇతరాలు)503
అక్టోబర్ 15, 2026స్కూల్ & ఇంటర్మీడియట్ విద్య (మెగా డీఎస్సీ – టీచర్లు)3,004
2026 అంతటాఇతర శాఖలు (Miscellaneous Departments)1,434
మొత్తం ఖాళీలు10,060

ముఖ్యమంత్రి సందేశం – ముఖ్యాంశాలు

“జాబ్ ఫస్ట్ అనేది కూటమి ప్రభుత్వ విధానం. అధికారంలోకి వచ్చిన 21 నెలల్లో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో 6 లక్షల పైచిలుకు ఉద్యోగ, ఉపాధి కల్పన జరిగింది. పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనతో ఈ ఏడాది ప్రైవేటు రంగంలో పెద్ద ఎత్తున ఉద్యోగ కల్పన జరగనుంది. ఈ క్రమంలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖ‌ల్లో 10,060 ఉద్యోగాల భర్తీ చేయబోతున్నాం. మే 15 నుంచి అక్టోబర్ 15 వరకు వీటికి సంబంధించిన నోటిపికేషన్లు రిలీజ్ చేస్తాం. ఉద్యోగార్థులు సన్నద్దతతో, ప్రతిభతో అవకాశాలను అందిపుచ్చుకోమని కోరుతున్నాను” అంటూ చంద్రబాబు తన పోస్టులో పేర్కొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

AP Job Calendar 2026 APPSC Group 1 Group 2 Vacancies 2026 Chandrababu Naidu Ugadi Gift for Unemployed Mega DSC 2026 Notification Date AP

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.