(AP) జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. కూటమి ప్రభుత్వంలో నామినేటెడ్ పదవులు పొందిన దాదాపు 3 వేల మందితో సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు.. కూటమి ప్రభుత్వంలో జనసేన తరఫున నామినేటెడ్ పదవులు పొందినవారు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. వారితో పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశమై దిశానిర్దేశం చేయనున్నారు.
Read Also: Tirumala: టీటీడీలో ఉద్యోగాలు.. మీరు అప్లై చేసారా?
కార్యక్రమ వివరాలను వివరించారు
మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌లో జరిగే ఈ కార్యక్రమం గురించి పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ ఛైర్మన్లు, డైరెక్టర్లు, పార్టీ నాయకులతో నాదెండ్ల మనోహర్ నిన్న టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి, కార్యక్రమ వివరాలను వివరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పార్టీ తరపున నిర్వహిస్తున్న “పదవి – బాధ్యత” కార్యక్రమం అత్యంత కీలకమైన సమావేశమని పేర్కొన్నారు. పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ చేయబోయే ప్రసంగం మనందరికీ మార్గదర్శకంగా ఉంటుందని తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: