AP: కృష్ణా జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ (jagan mohan reddy) రెడ్డి పర్యటనకు పోలీసులు కఠిన నిబంధనలు విధించారు. ‘మొంథా’ తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను ఆయన సందర్శించనున్న నేపథ్యంలో ఈ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. గతంలో జరిగిన అనుకోని ఘటనలను దృష్టిలో ఉంచుకుని భద్రతా కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. జగన్ పర్యటనకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే అనుమతి ఇచ్చారు. ఈ సమయంలో ఆయన గూడూరు మండలంలోని రామరాజుపాలెం, ఆకుమర్రు, సీతారామపురం, ఎస్ఎన్ గొల్లపాలెం గ్రామాలను సందర్శించనున్నారు.
News Telugu: Breaking News – Vizag: నేడు కృష్ణా జిల్లాలో పర్యటించనున్న జగన్
AP: తుఫాను ప్రాంతాల్లో పర్యటించనున్న జగన్..
AP: కాన్వాయ్‌లో గరిష్ఠంగా 10 వాహనాలు మాత్రమే ఉండాలనీ, మొత్తం 500 మందికి మించి ఎవరినీ అనుమతించరాదని పోలీసులు స్పష్టం చేశారు. అలాగే రహదారులపై ర్యాలీలు, భారీ గుమికూడింపులు, సమావేశాలు లేదా డీజేల వినియోగం నిషేధించారు. ప్రజల రాకపోకలకు ఆటంకం కలగకుండా చూసుకోవాలని సూచించారు. ఈ నిబంధనలను అతిక్రమించినా లేదా అనుమతిని దుర్వినియోగం చేసినా పర్యటనను తక్షణమే రద్దు చేస్తామని హెచ్చరించారు. పర్యటన సమయంలో జరిగే ఎలాంటి ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టానికి నిర్వాహకులే పూర్తి బాధ్యత వహించాలని పోలీసు అధికారులు తెలిపారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: