📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి

AP: చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ తీవ్ర విమర్శలు

Author Icon By Tejaswini Y
Updated: December 18, 2025 • 3:03 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

AP: చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వంపై వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి(Y. S. Jagan Mohan Reddy) తీవ్ర విమర్శలు చేశారు. ‘కోటి సంతకాల ఉద్యమం’ అపూర్వ విజయాన్ని సాధించిందని, ఇంత విస్తృత స్థాయిలో జరిగిన ఉద్యమం దేశ రాజకీయ చరిత్రలోనే అరుదైనదని ఆయన వ్యాఖ్యానించారు. ముఖ్యంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం అత్యంత పెద్ద అవినీతి వ్యవహారమని ఆరోపించారు.

Read Also: AP Digital Governance: అన్నీ ఇక ఇ- ఫైళ్లే..

AP: Jagan strongly criticizes Chandrababu Naidu’s government

రూ.120 కోట్ల జీతాల వ్యవహారం స్కాం కాదా?

పార్టీ కీలక నేతలతో నిర్వహించిన సమావేశంలో జగన్ మాట్లాడుతూ, కాలేజీలను ప్రైవేటు చేతుల్లో పెట్టి, మళ్లీ జీతాల పేరుతో రూ.120 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేయడం ఎలా సమర్థించుకుంటారని ప్రశ్నించారు. ఇది స్కాం కాదా అని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ ఉద్యమానికి కోటి 4 లక్షల 11 వేల 136 మంది సంతకాలు రావడం చరిత్రలో నిలిచిపోయే ఘట్టమని పేర్కొన్నారు. ఈ విజయానికి కృషి చేసిన గ్రామస్థాయి కార్యకర్తల నుంచి పార్టీ నాయకుల వరకు అందరికీ అభినందనలు తెలిపారు.

రెండు బడ్జెట్లు.. ప్రజలకు లాభం లేదు

చంద్రబాబు(Chandrababu) తన ప్రజాదరణ తగ్గుతోందని స్వయంగా అంగీకరించారని జగన్ వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వం రెండు బడ్జెట్లు ప్రవేశపెట్టినా ప్రజలకు స్పష్టమైన లాభం లేదని విమర్శించారు. తమ పాలనలో అమలైన ఫీజు రీయింబర్స్‌మెంట్, రైతు భరోసా వంటి సంక్షేమ పథకాలను ప్రస్తుత ప్రభుత్వం నిలిపివేసిందని ఆరోపించారు.

ప్రైవేటీకరణ అనేది ప్రజలపై భారం మోపే విధానమని, విద్య, వైద్యం ప్రభుత్వ బాధ్యతగా ఉండాలని జగన్ స్పష్టం చేశారు. తమ ప్రభుత్వ హయాంలో ఆర్టీసీని కాపాడేందుకు విలీన నిర్ణయం తీసుకున్నామని గుర్తు చేశారు. ప్రస్తుతం పాలకులు తమ వైఫల్యాలను దాచేందుకు అధికారులపై నిందలు మోపుతున్నారని ఆయన ఆరోపించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Andhra Pradesh politics Chandrababu Naidu Medical Colleges Privatization One Crore Signatures Campaign YS Jagan YSRCP

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.