ఆంధ్రప్రదేశ్(AP) రాజకీయాలలో ప్రస్తుతం విమాన ప్రయాణాల ఖర్చుల అంశం ప్రధాన చర్చగా మారింది. మాజీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి తన ఐదేళ్ల పాలనలో రాష్ట్ర నిధుల నుండి 222 కోట్ల రూపాయలను విమాన–హెలికాప్టర్ ప్రయాణాలపై ఖర్చు చేశారని తెలుగుదేశం పార్టీ విమర్శలు గుప్పిస్తోంది. మరోవైపు, ఈ ఆరోపణల నేపథ్యంలో జగన్ వర్సెస్ లోకేష్ వివాదం మరింత తీవ్రతరమైంది.
Read also: గురుకుల సంస్థలో 4 వేల ఉద్యోగాలు దరఖాస్తు
లోకేష్ పై వైసీపీ ఆరోపణలు టీడీపీ రివర్స్ ఆరోపణలు
ఇటీవల మంత్రి నారా లోకేష్పై ఆరోపణలు చేస్తూ, ఆయన వారాంతాల్లో తరచుగా హైదరాబాద్‌కు వెళ్లేందుకు చార్టర్డ్ విమానాలను వాడుకుంటూ ప్రభుత్వ నిధులను వృథా చేస్తున్నారని ప్రచారం చేసింది. అయితే దీనిపై టీడీపీ స్పష్టమైన ప్రతిస్పందన ఇచ్చింది. ఒక పౌరుడు ఆర్టీఐ ద్వారా లోకేష్ విమాన ప్రయాణ ఖర్చుల వివరాలు కోరగా, ప్రభుత్వ శాఖలు వెల్లడించిన సమాచారం ప్రకారం లోకేష్ ప్రయాణాలకు ఒక్క రూపాయి కూడా ప్రభుత్వ ఖజానా నుంచి ఖర్చు చేయలేదని స్పష్టం చేశారు. ఆయన బాధ్యత వహిస్తున్న ఐటీ, ఆర్టీజీఎస్, ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ధి వంటి శాఖల ద్వారా ఎలాంటి బిల్లులు చెల్లించలేదని పేర్కొన్నారు. అంటే, లోకేష్ చేసిన 77 హైదరాబాద్ పర్యటనల ఖర్చులన్నీ ఆయన స్వంతంగా భరించారని ప్రభుత్వం వెల్లడించింది. దీంతో వైసీపీ చేసిన ఆరోపణలు అసత్యమని టీడీపీ మండిపడుతోంది.
టీడీపీ వెల్లడించిన నూతన గణాంకాల ప్రకారం, ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ఏవియేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ రికార్డుల్లో మాజీ సీఎం జగన్ 2019–2024 మధ్య కాలంలో హెలికాప్టర్, విమాన ప్రయాణాల కోసం మొత్తం రూ.222.85 కోట్లు ప్రజా ధనాన్ని ఖర్చు చేశారని తెలిపారు. ఈ సంఖ్యలతో టీడీపీ, వైసీపీపై రాజకీయ దాడిని కొనసాగిస్తోంది. టీడీపీ ఆరోపణలకు స్పందించిన వైసీపీ, నారా లోకేష్‌పై విమర్శల జడివాన కురిపించింది. తండ్రి చంద్రబాబు లేకపోతే లోకేష్ మంత్రి కావడం కుదరేది కాదని, అంతేకాదు అబద్ధాలు చెప్పడంలో లోకేష్ నైపుణ్యం సాధించాడని వైసీపీ ఎద్దేవా చేసింది. అంతకుమించి, చంద్రబాబు భారత రాజకీయాల్లో “అబద్ధాల ఛాంపియన్” అని వ్యాఖ్యానిస్తూ, ప్రతీరోజూ కనీసం ఒక అబద్ధం సోషల్ మీడియాలో పెట్టకుండా బాబు, లోకేష్ నిద్రపోవడం కూడా కష్టమేనా? అంటూ వైసీపీ తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: