📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి

News Telugu: AP: జగన్ కు న్యాయస్థానాలంటే గౌరవం లేదు: సిఎం చంద్రబాబు

Author Icon By Rajitha
Updated: December 17, 2025 • 11:48 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయవాడ,డిసెంబరు 16, ప్రభాతవార్తప్రతినిధి: జగన్ కు న్యాయస్థానాలంటే గౌరవం లేదని, లెక్కలేనట్లు మాట్లాడుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu naidu) వ్యాఖ్యానించారు. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన సీఎం.. న్యాయస్థానాల పట్ల జగన్ వ్యవహార శైలిని తప్పుపట్టారు. జగన్ తన అక్రమాస్తుల కేసుల్లో కోర్టుకు గైర్హాజరవుతాడు. సుప్రీంకోర్టు ఉత్తర్వులను అమలు చేస్తున్నా అభ్యంతరం వ్యక్తం చేస్తాడు. న్యాయస్థానాలంటే జగన్ కు ఏమాత్రం లెక్కలేదు. అంటూ విమర్శలు గుప్పించారు సీఎం. పరకామణి చోరీ కేసును సాధారణ కేసుగా చూడటాన్ని హైకోర్టు కూడా తప్పు పట్టిందని గుర్తు చేశారు సీఎం. భక్తులు కానుకగా సమర్పించిన సొమ్ము చోరీ కావటం సెంటిమెంట్తో ముడిపడిన అంశం అని.. పరకామణి లెక్కింపులో కూడా ఏఐ వాడాలని న్యాయస్థానాలు చెప్పటం శుభపరిణామం అన్నారు.

Read also: AP: కౌలు రైతులకు పంట రుణాలు మంజూరు- DCCBలకు ప్రభుత్వ ఆదేశాలు

నిర్మలా సీతారామన్ ను సైతం

పీపీపీ వైద్య కళాశాలల విషయంలో వైసీపీ ఎంపీలు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ను సైతం తప్పుదోవ పట్టించే యత్నం చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పీపీపీ విధానంపై తనను తప్పుదోవ పట్టించే యత్నం చేయవద్దని కేంద్ర ఆర్థిక మంత్రి గట్టిగా చెప్పటంతో వారు వెనుదిరిగారన్నారు. పీపీపీ అనేది ప్రపంచవ్యాప్తంగా అమలవుతున్న సక్సెక్ మోడల్ అని.. అన్ని రంగాల్లోనూ ఇది అమలవుతోందన్నారు సీఎం. దీని కారణంగా సీట్లు పెరగటంతో పాటు పేదలకు కార్పొరేట్ వైద్యం అందుతుందన్నారు. కుటుంబ సభ్యుల మధ్య ఉద్యోగ నియామక పత్రాలు అందచేయటం అభ్యర్థులకు గొప్ప అనుభూతినిస్తుందన్నారు ముఖ్యమంత్రి. నాడు డీఎస్సీ, నేడు యువగళం పేరిట పోలీసు కానిస్టేబుల్ నియామకాలు ఈ తరహా విధానం అందుకే అనుసరిస్తున్నామని సీఎం చంద్రబాబు చెప్పారు, జగన్ ను ప్రజలు విశ్వసించడం లేదు. అతని నిజస్వరూపం గమనించిన తరువాతే గట్టి బుద్ది చెప్పారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Chandrababu Naidu Jagan Mohan Reddy latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.