AP: రాజకీయాల్లో రాబోతున్న విజయసాయిరెడ్డి.. ఆ పార్టీలో చేరుతారా?

Read Time:  1 min
AP: రాజకీయాల్లో రాబోతున్న విజయసాయిరెడ్డి.. ఆ పార్టీలో చేరుతారా?
FONT SIZE
GET APP

(AP) మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి (Vijayasai Reddy) మళ్లీ రాజకీయాల్లో రానున్నట్లు తెలిసింది. అయితే ఆయన ఏ పార్టీలో చేరుతారనే విషయం క్లారిటీ లేదు. కానీ ఇటీవల ఓ సామాజిక వర్గ సమావేశంలో చేసిన వ్యాఖ్యలు చూస్తే ఆయన చేరబోయే పార్టీ బహుశా అదేనని ఫుకార్లులు వినిపిస్తున్నాయి.

విజయసాయిరెడ్డి ఆ సమావేశంలో దేశం గురించి, ధర్మం గురించి గట్టిగానే మాట్లాడారు. హిందూ ధర్మంపై, హిందువులపై జరుగుతున్న దాడులపై ప్రసంగించారు. ఆయన మాటల్లో ఎక్కువగా బీజేపీ భావజాలమే కనిపించిందని పలువురు అంటున్నారు. దాంతో ఆయన బీజేపీలో చేరబోతున్నారని సమాచారం.

Read Also: TG: రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం: CM రేవంత్

AP: రాజకీయాల్లో రాబోతున్న విజయసాయిరెడ్డి.. ఆ పార్టీలో చేరుతారా?
Is Vijayasai Reddy entering politics Will he join that party?

గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషించిన ఆయన, ప్రస్తుతం పార్టీ రాజకీయాలకు దూరంగా ఉంటూనే కొత్త రాజకీయ దిశలో అడుగులు వేస్తున్నారా? అనే చర్చ మొదలైంది. (AP) ఈ పరిణామాల నేపథ్యంలో ఆయన త్వరలో బీజేపీలో చేరే అవకాశం ఉందన్న ప్రచారం బలంగా వినిపిస్తోంది. అయితే దీనిపై విజయసాయిరెడ్డి నుంచి కానీ, బీజేపీ వర్గాల నుంచి కానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. రాజకీయంగా కీలక పరిణామాలకు ఇది సంకేతమా అనే దానిపై ఆసక్తి నెలకొంది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.