📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం

News Telugu: AP Investments: పెద్ద ఎత్తున ముందుకు వస్తున్న ఇన్వెస్టర్లు

Author Icon By Rajitha
Updated: December 5, 2025 • 11:53 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయవాడ : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సీబీఎన్ బ్రాండ్ తో పెద్ద ఎత్తున ఇన్వెస్టర్లు ముందుకు రాగా 18 నెలల్లోనే 20 లక్షల కోట్ల వరకూ పెట్టుబడులు సాధించగలిగామని మంత్రులు కందుల దుర్గేష్, (kandula durgesh) భరత్ వెల్లడించారు. గురువారం వెలగపూడి సచివాలయంలోని పబ్లిసిటీ సెల్ విభాగంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్ఐపీబీలో ఆమోదం పొందిన పెట్టుబడులను వివరించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఇవాళ జరిగిన 13వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశంలో రూ.20,444 కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించిందన్నారు. మొత్తం 26 సంస్థలకు రాష్ట్రంలో యూనిట్లు ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపామన్నారు. తద్వారా 56,278 మందికి ఉద్యోగాలు దక్కుతాయని స్పష్టం చేశారు. ఇవే కాకుండా ఎర్లీబర్డ్ ప్రోత్సాహకాల కింద మరో ఆరు కంపెనీలకు కూడా ఆమోదం తెలిపామని వెల్లడించారు. ఇటీవల విశాఖ సీఐఐ సదస్సులో ఒప్పందాలు కుదుర్చుకున్న 6 కంపెనీలకు కూడా ఇవాళ ఆమోదం తెలిపామన్నారు.

Read also: AP Capital: అమరావతికి త్వరలోనే అధికారిక గుర్తింపు..

AP Investments

20 లక్షల ఉద్యోగాల కల్పిస్తామనే హామీ

అదే విధంగా విశాఖ పెట్టుబడుల సదస్సు లో కుదుర్చుకున్న ఎంఓయూల పై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రివ్యూ చేశారని దీని కోసం ఓ పోర్టల్ ను కూడా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఎంఓయూలు సాకారమై ప్రాజెక్టులు గ్రౌండింగ్ చేసేందుకు నేరుగా ముఖ్యమంత్రి, సీఎస్, మంత్రివర్గ ఉపసంఘం, ఆయా శాఖలకు చెందిన మంత్రులు కూడా నిరంతరం పర్యవేక్షిస్తారని పేర్కొన్నారు. దావోస్ లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం లో పాల్గోనేందుకు వెళ్ళేలోగా వీలైనన్ని ఎంఓయూలు గ్రౌండింగ్ అయ్యేలా చూడాలని సీఎం నిర్దేశించినట్లు మంత్రి దుర్గేష్ తెలిపారు. మొత్తం కుదుర్చుకున్న ఎంఓయూల్లో 50 శాతం మేర పెట్టుబడులకు ప్రాసెస్ ప్రారంభమైపోయిందని అన్నారు. ఇప్పటి వరకూ పెట్టుబడుల సదస్సులో కుదుర్చుకున్న ఒప్పందాల్లో రూ.7.69 లక్షల కోట్ల మేర పెట్టుబడులు, ఆయా కంపెనీలకు సంబంధించిన ప్రాసెస్ కూడా ప్రారంభమైందని తెలిపారు.

7,62,148 మందికి ఉద్యోగాలు

విశాఖ ఎకనామిక్ రీజియన్ పరిధిలో రూ.1.69 లక్షల కోట్లు, అమరావతి ఎకనామిక్ రీజియన్ పరిధిలో సుమారు రూ.87 వేల కోట్లు, తిరుపతి ఎకనామిక్ రీజియన్ పరిధిలో సుమారు. 73 వేల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయన్నారు. ఇప్పటి వరకూ 13 ఎస్ఐపీబీ సమావేశాల్లో రూ.8.29 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపామన్నారు. తద్వారా 7,62,148 మందికి ఉద్యోగాలు ప్రత్యక్షంగా లభించనున్నాయన్నారు. 20 లక్షల ఉద్యోగాల కల్పిస్తామనే హామీని సాకారం చేసే దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఘంటాపథంగా తెలిపారు. ఇప్పటి వరకూ వచ్చిన కంపెనీల్లో ప్రపంచ ఐటీ దిగ్గజం గూగుల్, టీసీఎస్, కాగ్నిజెంట్, ఆర్సెలార్ మిట్టల్, రేమాండ్స్, రిలయన్స్ లాంటి సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెడుతున్నాయని స్పష్టం చేశారు. గ్రీన్ ఎనర్జీ ఉత్పాదనకు సంబంధించి విద్యుత్ ఉత్పత్తి, టూరిజం, మోలిక సదుపాయాలు, లాజిస్టిక్స్, ఐటీ, ఫుడ్ ప్రాసెసింగ్, హెల్త్, ఆటోమొబైల్, ఏరో స్పేస్, డిఫెన్స్ తదితర రంగాల్లో పెట్టుబడులు తాము ఆకర్షిస్తున్నామన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

AP-investments chandrababu-naidu MoUs SIPB

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.