AP Inter Summer Holidays: రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ పబ్లిక్ పరీక్షలు మార్చి 24తో పూర్తి కానున్నాయి. పరీక్షలు ముగిసిన వెంటనే విద్యార్థులకు విరామం ఇవ్వకుండా, ఫస్ట్ ఇయర్ పూర్తి చేసిన వారికి ఏప్రిల్ 1 నుంచి 23 వరకు సెకండ్ ఇయర్ తరగతులను నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. దీనివల్ల వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి సిలబస్‌ను ముందుగానే ప్రారంభించే అవకాశం ఉంటుంది.
Read Also: Nellore Lorry Accident: కూల్‌డ్రింక్స్ లారీ బోల్తా.. ఎగబడిన జనం (వీడియో)

వేసవి సెలవుల షెడ్యూల్ ఇదే:
- పాఠశాలలకు: రాష్ట్రవ్యాప్తంగా అన్ని స్కూళ్లకు ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి.
- ఇంటర్ విద్యార్థులకు: ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఏప్రిల్ 24 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు ఉంటాయి.
కాలేజీలు ఎప్పుడు తెరుస్తారంటే?
వేసవి సెలవుల అనంతరం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ జూనియర్ కాలేజీలు జూన్ 1 నుంచి పునఃప్రారంభం అవుతాయి. జూన్ మొదటి వారం నుంచే రెగ్యులర్ తరగతులు యథావిధిగా సాగుతాయని అధికారులు స్పష్టం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: