📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

AP Inter exams: ఇంటర్ పరీక్ష కేంద్రాల ఆకస్మిక తనిఖీ చేసిన తిరుపతి జిల్లా కలెక్టర్

Author Icon By Pooja
Updated: February 23, 2026 • 2:42 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

AP Inter exams: ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి 23 నుండి ప్రారంభమైన నేపథ్యంలో తిరుపతి నగరంలోని వరదరాజ నగర్ నందు గల నారాయణ జూనియర్ కళాశాల, వెంకటేశ్వర జూనియర్ కళాశాలలను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్ ఆకస్మిక తనిఖీ చేసి ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కు తావివ్వకుండా పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు.

Read Also:AP Inter Exams: చిత్తూరులో ఇంటర్ పరీక్షలకు డ్రోన్ నిఘా..

AP Inter exams: Tirupati District Collector conducts surprise inspection of Inter exam centers

సోమవారం ఉదయం తిరుపతి నగరంలోని వరదరాజ నగర్ నందు గల నారాయణ జూనియర్ కళాశాల, వెంకటేశ్వర జూనియర్ కళాశాలలను జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. చీఫ్ సూపరింటెండెంట్లను, ఇన్విజిలేటర్లతో పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. పరీక్ష కేంద్రం నందు సీసీ కెమెరాల ఏర్పాటుతో అమరావతి ఇంటర్మీడియట్ బోర్డుకు అనుసంధానంతో పర్యవేక్షణ జరుగుతోందని, క్యాంపస్ లో మెడికల్ సిబ్బంది క్యాంపు ఏర్పాటు, త్రాగునీరు, తగినంత వెలుతురు, బందోబస్తు అన్ని ఏర్పాట్లు ఉన్నాయని అధికారులు వివరించారు. ఎలాంటి మాల్ ప్రాక్టీస్ జరగకుండా పర్యవేక్షించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పరిక్షా కేంద్రాలలో గల సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణను కలెక్టర్ పరిశీలించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

DistrictCollector ExamInspection JuniorColleges TirupatiDistrict

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.