AP Inter Exams 2026: ఆంధ్రప్రదేశ్‌లో ఇవాళ్టి నుంచి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరవుతున్నారు. సోమవారం ప్రారంభమైన ఈ పరీక్షలు మార్చి 24 వరకు కొనసాగనున్నాయి. పరీక్షల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఇంటర్ బోర్డు విస్తృత ఏర్పాట్లు చేసింది. పరీక్షలకు 1,537 కేంద్రాలు సిద్ధం చేయగా, 45 కేంద్రాలను సున్నిత ప్రాంతాలుగా గుర్తించారు. మొత్తం 10,57,899 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు జరుగుతాయి.
Read Also: VasanSettiSubhash: BRS పార్టీపై మంత్రి వాసంశెట్టి సుభాష్ హాట్ కామెంట్స్
ఒక్క నిమిషం ఆలస్యం అయినా అనుమతి లేదు
విద్యార్థులు 8.30కల్లా కేంద్రానికి చేరుకుని హాల్ టికెట్ తప్పనిసరిగా చూపించాలని, ఒక్క నిమిషం ఆలస్యం అయినా అనుమతి లేదని అధికారులు తెలిపారు.పరీక్ష కేంద్రాల్లో మొబైల్ ఫోన్‌లు, స్మార్ట్ వాచ్‌లు, కాలిక్యులేటర్ సహా ఎలాంటి గాడ్జెట్ లకు చోటు లేదు. ప్రతి కేంద్రం వద్ద సిసి కెమెరాల నిఘా, 144 సెక్షన్ అమలులో ఉంటుంది. ఈ మేరకు ఇప్పటికే అధికారులు పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఎండలు మొదలు కావడంతో ప్రతి కేంద్రంలో తాగునీరు, ప్రాథమిక చికిత్స సౌకర్యాలు అధికారులు కల్పించారు.
ఉమ్మడి కృష్ణాజిల్లా వ్యాప్తంగా 56 వేల మంది విద్యార్థులు మొదటి సంవత్సరం పరీక్ష రాస్తుండగా, 46 వేల మంది విద్యార్థులు రెండో సంవత్సరం పరీక్ష రాస్తున్నారు. ఏదైనా సమస్యలకు 1800 425 1531 నెంబర్ ను సంప్రదించవచ్చని ఇంటర్ బోర్డు అధికారులు విద్యార్ధులకు సూచనలు జారీ చేశారు. మరోవైపు పరీక్షల పర్యవేక్షణకు ప్రతి కేంద్రం వద్ద ఒక అబ్జర్వర్‌ను నియమించారు. సమస్యాత్మక కేంద్రాల్లో సిటింగ్ స్క్వాడ్‌లు, ఇతరచోట్ల ఫ్లయింగ్ స్వ్వాడ్‌ల నిఘా ఉంటుంది. ప్రతి కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఆర్‌ఐవో, ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయాలకు వాటిని అనుసంధానం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: