AP Inter Exams 2026: ఇంటర్ విద్యార్థులకు ఆల్ ది బెస్ట్: లోకేష్

Read Time:  1 min
AP Inter Exams 2026: ఇంటర్ విద్యార్థులకు ఆల్ ది బెస్ట్: లోకేష్
FONT SIZE
GET APP

AP Inter Exams 2026: ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు నేటి నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో మంత్రి నారా లోకేశ్ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థుల కృషి, పట్టుదల, నమ్మకం వారి విజయానికి మార్గం చూపుతాయని, ప్రశాంతంగా, ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని సూచించారు. అందరి భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని ఆకాంక్షించారు.

Read Also: Mohan ranga daughter : వైసీపీలో చేరికా? వంగవీటి ఆశాలత క్లారిటీ ఇదిగో!

ఒక్క నిమిషం నిబంధన

తొలి రోజు ఫస్ట్‌ ఇయర్ విద్యార్ధులకు, మరుసటి రోజు సెకండ్ ఇయర్‌ పరీక్షలు మొదలవుతాయి. ఈ సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 10,57,899 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. ఇందులో 5,31,275 మంది మొదటి సంవత్సరం విద్యార్థులు కాగా.. 5,26,264 మంది రెండవ సంవత్సరం విద్యార్థులు హాజరు కానున్నారు.

ఉమ్మడి కృష్ణా జిల్లాలో సుమారు 1,02,000 విద్యార్థులు పరీక్ష రాయబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1537 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.​ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా సుమారు 150 కి పైగా పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. పరీక్ష సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా కేంద్రంలోకి అనుమతించబోరని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది.ఇక సోమవారం మొదలయ్యే పరీక్షలు మార్చి 24వ తేదీ వరకు కొనసాగనున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Aanusha

రచయిత గురించి

Aanusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.