జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నాగేంద్రబాబు (నాగబాబు) తన రాజకీయ భవిష్యత్తుపై కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. తాను ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయబోనని స్పష్టం చేసిన ఆయన, పదవుల కంటే పార్టీ కార్యకర్తగా పనిచేయడమే తనకు ఎక్కువ సంతృప్తినిస్తుందని చెప్పారు. ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా శ్రీకాకుళంలో పార్టీ నేతలతో సమావేశమైన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేస్తూ, తనపై జరుగుతున్న ప్రచారానికి తెరదించారు.
Read also: AP: అంధ క్రీడాకారులను గౌరవించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

I will not contest in direct elections
ఇటీవల నాగబాబు శ్రీకాకుళంలో తరచూ పర్యటించడంతో అక్కడి నుంచి ఎంపీగా పోటీ చేస్తారనే ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. దీనిపై స్పందించిన ఆయన, ఎమ్మెల్యేగా లేదా ఎంపీగా పోటీ చేయాలనే ఉద్దేశం ఉంటే గత ఎన్నికలలోనే ఆ నిర్ణయం తీసుకునేవాడినని తెలిపారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్న తాను పార్టీ కోసం పనిచేయడానికే ప్రాధాన్యం ఇస్తున్నానని, ఐదారేళ్ల తర్వాత రాజకీయ పరిస్థితులు ఎలా ఉంటాయో ఇప్పుడే చెప్పలేమని వ్యాఖ్యానించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: