ఏపీ (AP) ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన గ్రూప్-2 తాజా ఫలితాలు రాష్ట్రవ్యాప్తంగా ఎంతో మంది అభ్యర్థుల్లో ఆనందాన్ని నింపాయి. ఈ ఫలితాల్లో అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన వినీత, హేమచంద్ర అనే భార్యాభర్తలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇద్దరూ ఒకే సమయంలో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం మాత్రమే కాకుండా, కీలకమైన పోస్టుల్లో ఎంపిక కావడం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
Read Also: YS Jagan Padayatra : జగన్ 2.0 షురూ? పాదయాత్రపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన జగన్
కష్టపడి చదవి గ్రూప్ కొలువు సంపాదించారు
హేమచంద్ర, వినత దంపతులు ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు చేస్తూనే గ్రూప్-2 పరీక్షలకు సిద్ధమయ్యారు. కష్టపడి చదివి ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగాలు పొందారు. వినత సబ్-రిజిస్ట్రార్‌గా, హేమచంద్ర ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్‌గా ఎంపికయ్యారు. గతంలో వినతకు కోర్టులో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం వచ్చినా ఆ ఉద్యోగంలో చేరలేదు. ఆ తర్వాత బ్యాంకులో క్లర్క్‌గా కొన్నాళ్లు పనిచేశారు.. అయినా సరే కష్టపడి చదవి గ్రూప్ కొలువు సంపాదించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: