📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ గవర్నర్ అబ్దుల్ నజీర్ సిఎం చంద్రబాబు భేటీ ఈ నెల 15 వరకు రేషన్ కార్డు తీసుకొనే గడువు టెన్త్ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు అమరావతికి త్వరలోనే అధికారిక గుర్తింపు.. చిలకలూరిపేటలో రోడ్డు ప్రమాదం.. జాతీయ స్థాయిలో గిరిజన విద్యార్థుల మెరుపులు 2,500 ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ గవర్నర్ అబ్దుల్ నజీర్ సిఎం చంద్రబాబు భేటీ ఈ నెల 15 వరకు రేషన్ కార్డు తీసుకొనే గడువు టెన్త్ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు అమరావతికి త్వరలోనే అధికారిక గుర్తింపు.. చిలకలూరిపేటలో రోడ్డు ప్రమాదం.. జాతీయ స్థాయిలో గిరిజన విద్యార్థుల మెరుపులు 2,500 ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ

Latest News: AP: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రతిష్టను దిగజార్చేందుకు భారీ కుట్ర

Author Icon By Saritha
Updated: December 9, 2025 • 12:05 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విశాఖపట్నం : రూ. లక్షల(AP) కోట్లు పెట్టు బడులు, లక్షల ఉద్యోగాలంటూ చంద్రబాబు(CM Chandrababu) ప్రభుత్వం కబుర్లు చెప్పి అందుకు తగ్గట్లు కార్యాచరణ లేకుండా వ్యవహరిస్తుందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు ఎద్దేవా చేశారు. సోమవారం జగదాంబ జంక్షన్ సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గతంలో వేల ఏకరాల భూములను రైతుల నుంచి తీసుకున్నా, ఏ పరిశ్రమా రాలేదని, భూముల కోసం తప్ప పెట్టుబడి ఆసక్తి కనిపించడం లేదన్నారు. ఐటి మంత్రి లోకేష్ కూడా గడచిన 17 నెలల్లో రూ.20లక్షల కోట్లు పెట్టుబడులను తెచ్చామన్నారని, ఈ డబ్బంతా ఎక్కడికి వెళ్లిపోయిందో చెప్పాలని కోరారు. 20ఏళ్ల క్రితం రైతులు నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో అదానీ పేరుతో 10వేల ఎకరాలు, అనంతపురంలో 8వేల ఎకరాలు లేపాక్షి కోసం, ప్రకాశం జిల్లా పనుకొండలో 80వేల ఎకరాలు ఇచ్చారన్నారు.

Read also: విశ్వవిద్యా కేంద్రంగా తెలంగాణ

Huge conspiracy to tarnish the reputation of Visakhapatnam Steel Plant

పెట్టుబడులు–ఉద్యోగాల పేరుతో జరుగుతున్న అన్యాయాలపై ఆగ్రహం

ఈ భూములన్నీ(AP) పెట్టుబడిదారుల స్పెక్యులేషన్ వ్యాపారానికి వాడుకున్నారు తప్ప, పరిశ్రమలు రాలేదని, భూములిచ్చిన రైతులకు ఏం పరిహారం ఇచ్చారంటూ ప్రశ్నించారు. డేటా సెంటర్లలో వచ్చే ఉద్యోగాలు 300 కంటే మించవని, గూగుల్ కి చౌకగా నీరు, విద్యుత్ ఇవాల్సిన అవసరం లేదన్నారు. కోసం 2800 ఎకరాలు, కాకినాడలో సెజ్ ల ఆదాని, టాటా కోసం కాకుండా, నిజంగా ఉపాధి కల్పించాలనుకుంటే ఉపాధి సష్టించగల ఫుట్వేర్, గార్మెంట్, టెక్మైల్ ఇండస్ట్రీ, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు పెట్టాలని రాఘవులు డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రతిష్టను దిగజార్చి, కార్మికుల జీతాల్లో కోత పెట్టడానికి యాజమాన్యం ఉత్పత్తితో లింకు పెట్టి ఉద్యోగాలను కార్మికులు అంతిమంగా పదులుకునేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యాజమాన్యం కుట్ర చేస్తున్నాయని మండిపడ్డారు. దేశంలోని కీలక రంగాల్లో ప్రభుత్వ ఆధిపత్యం ఉండి తీరాలని ప్రైవేట్ వాళ్ల పెత్తనానికి వదిలేస్తే తాజాగా నెలకొన్న విమానయాన రంగం ఎలా కకావికలం అయ్యిందో దేశం అంతా చూస్తుందని తెలిపారు. ఇది కచ్చితంగా పాలకవర్గ విధానాల వల్ల వచ్చిన సంక్షోభమన్నారు. కేంద్రం స్పందించకపోవడం వెనుక ప్రైవేట్ విమానయాన సంస్థతో కుమ్మక్మయిందా? అని ప్రశ్నించారు. సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె లోకనాథం, జిల్లా కార్యదర్శి ఎం జగ్గు నాయుడు పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Andhra Pradesh Government BV Raghavulu CPM industrial policy Land Acquisition Latest News in Telugu Visakha Steel Plant

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.