AP HPV Vaccine: 28 నుంచి HPV వ్యాక్సిన్ పంపిణీ

Read Time:  1 min
AP HPV Vaccine: 28 నుంచి HPV వ్యాక్సిన్ పంపిణీ
FONT SIZE
GET APP

AP HPV Vaccine: గర్భాశయ ముఖద్వార (సర్వైకల్) క్యాన్సర్ నివారణకు దేశంలో 14 ఏళ్లు నిండిన బాలికలకు హ్యూమన్ పాపిలోమా వైరస్ (HPV) వ్యాక్సిన్ను కేంద్ర ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేయనుంది. ఈ పంపిణీని ఈ నెల 28న దేశవ్యాప్తంగా కేంద్ర ఆరోగ్యశాఖ (Health Ministry) ప్రారంభించనుంది. రాష్ట్రంలోని 3.45 లక్షలమంది బాలికలకు ఈ వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉంటుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ అంచనా వేస్తోంది. గ్రామ/వార్డు సచివాలయాల శాఖ సమాచారం ప్రకారం అత్యధికంగా కర్నూలు జిల్లాలో 23,957 మంది, అత్యల్పంగా పోలవరం జిల్లాలో 2,777 మంది బాలికలు ఉన్నారు.

Read Also: Tirumala Ghat Road Accident: తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం.. ఒకరు దుర్మరణం!

AP HPV Vaccine: 28 నుంచి HPV వ్యాక్సిన్ పంపిణీ
AP HPV Vaccine: Free HPV vaccine starts from today

ఆరోగ్య కేంద్రాల్లో వ్యాక్సిన్

1,683 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వ్యాక్సిన్ పంపిణీ కోసం ఇప్పటికే వైద్య సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. 0.5 ఎంఎల్ వ్యాక్సిన్ను ఇంజక్షన్ రూపంలో ఇస్తారు. సుమారు మూడు నెలలు జరిగే వ్యాక్సిన్ డ్రైవ్కు తొలివిడత కింద కేంద్రం నుంచి 1,90,890 డోసుల వ్యాక్సిన్ వెయిల్స్ రాష్ట్రానికి చేరుకున్నాయి. వ్యాక్సిన్ ఇచ్చే ముందు తల్లిదండ్రుల్లో ఒకరి సమ్మతి తప్పనిసరి అని నిబంధన ఉంది. పీహెచ్సీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య వ్యాక్సిన్ ఇస్తారు. వ్యాక్సిన్ పంపిణీ వివరాలను యూవిన్ డిజిటల్ పోర్టల్లో నమోదు చేస్తారు. వాస్తవానికి ఈ హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ ఖరీదు రూ. 3,927 ఉంటుంది.. బాలిక తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించి వ్యాక్సినేషన్ చేయించాలని సూచిస్తున్నారు. అటు తెలంగాణలో కూడా ఈ వ్యాక్సిన్ అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.