AP Housing Scheme: రాష్ట్రంలోని అర్హులైన ప్రతి పేదవాడికి 2029 సంవత్సరం నాటికి పక్కా ఇల్లు లేదా ఇంటి స్థలాన్ని అందించడమే ప్రభుత్వ ధ్యేయమని గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి(Minister Parthasarathy) స్పష్టం చేశారు. ఈ లక్ష్య సాధనలో భాగంగా, ఈ ఏడాది ముగిసేలోపు సుమారు 2.61 లక్షల గృహాల నిర్మాణాన్ని పూర్తి చేసి, లబ్ధిదారులకు అప్పగించనున్నట్లు ఆయన వెల్లడించారు.
Read Also: Jagan 2.0: ఈసారి మాములుగా ఉండదంటూ కార్యకర్తల్లో జోష్ నింపిన జగన్
7.5 లక్షల మంది ఇళ్లకు అర్హులు
ప్రభుత్వానికి అందిన 10 లక్షల దరఖాస్తులను పరిశీలించగా, సుమారు 7.5 లక్షల మంది ఇళ్లకు అర్హులుగా ఉండవచ్చని ప్రాథమికంగా అంచనా వేసినట్లు మంత్రి తెలిపారు. మిగిలిన 2.5 లక్షల మందికి కూడా ఇంటి స్థలాలను కేటాయించాలని మంత్రిమండలి నిర్ణయించిందని ఆయన పేర్కొన్నారు. సొంత గృహం లేని నిరుపేదలకు ప్రాధాన్యతనిస్తూ ఈ పథకాన్ని పారదర్శకంగా అమలు చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: