📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest news: AP: ఆసుపత్రులో కొత్తగా 15 న్యూట్రిషన్ కేంద్రాలు

Author Icon By Saritha
Updated: November 22, 2025 • 11:35 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మంత్రి సత్యకుమార్

విజయవాడ : రాష్ట్రంలోని (AP) ముఖ్యమైన 15 ప్రభుత్వాసుపత్రుల్లో న్యూట్రిషన్ రిహాబిలిటేషన్ సెంటర్స్ (ఎన్.ఆర్.సి.లు) త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ నేడొక ప్రకటనలో తెలిపారు. ఈ కేంద్రాల ద్వారా ఐదేళ్లలోపు వయస్సు కలిగిన చిన్నారులకు సేవలందుతాయి. ఈ 15లో 11 గిరిజన ప్రాంతాల్లో వస్తాయని పేర్కొన్నారు. వీటన్నిటిలో కలిపి 115 పడకలు చిన్నారులకు అందుబాటులోకి రానున్నాయని, ప్రస్తుతం రాష్ట్రంలో 21 ఎన్ఆర్సీలు ఉండగా… వీటిల్లో 340 పడకలు ఉన్నాయని తెలిపారు. ఆశా, ఎ.ఎన్.ఎం.ల నుంచి అందే సమాచారంతో పీహెచ్సీ వైద్యులు పరిక్షలు చేసిన అనంతరం సదరు చిన్నారులను సమీపంలోని ఎన్ఆర్సీలకు పంపుతారు. ఈ కేంద్రాల్లో చిన్నారులు ఎత్తుకు తగ్గ బరువు ఉన్నారా? లేదా అని పరిశీలించి ట్రీట్మెంట్ ఇస్తారు. ఈ కేంద్రాల్లోనే ఉండే న్యూట్రిషన్ కౌన్సిలర్లు చిన్నారులకు ఎలాంటి ఆహారం (పీడింగ్) ఇవ్వాలన్న దానిపై చేసిన సిఫారసులు అనుసరించి సిబ్బంది సమకూరుస్తారు. ఇలా 2 వారాలపాటు వైద్యంతోపాటు సమాంతరంగా పౌష్టికాహారం (ప్రొటీన్ రిచ్ పుడ్) చిన్నారులకు అందిస్తారు.

Read also: పదో తరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్ విడుదల

15 new nutrition centers in the hospital

జాతీయ ఆరోగ్య మిషన్ ఆధ్వర్యంలో కేంద్రాల నిర్వహణ

అల్లూరి సీతారామరాజు జిల్లా(Alluri Seetharamaraju District) అరకు ఏరియా ఆసుపత్రి, ముంచింగిపట్టు, చింతపల్లి సీహెచ్సీల్లో వచ్చే ఈ సెంటర్లలో 10 చొప్పున పడకలు ఉంటాయి. అనకాపల్లి జిల్లా(AP) అసుపత్రి, బాపట్ల, పల్నాడు. ఏరియా ఆసుపత్రులు, పల్నాడు జిల్లా నరసరావుపేట ఏరియా ఆసుపత్రి, నంద్యాల జిల్లా నంద్యాల బోధనాసుపత్రి, సున్నిపెంట ఏరియా ఆసుపత్రిలో వచ్చే ఈ కేంద్రాల్లో 10 చొప్పున పడకలు ఉంటాయి. ఈ పడకల కోసం ప్రతి ఆసుపత్రిలో ప్రత్యేకంగా వార్డులు ఏర్పడతాయి. పార్వతీపురం జిల్లా సాలూరు, పాలకొండ ఏరియా ఆసుపత్రులు, భద్రగిరి, కురుపాం, చిన్నమరంగి సీహెచ్సీల్లో, అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగల ఏరియా ఆసుపత్రి, రామవరం సీహెచ్సీల్లో ఉన్న పడకలకు అదనంగా ఐదు చొప్పున ఈ సెంటర్ల కింద రానున్నాయి. 13 బోధనాసుపత్రుల్లో 20 చొప్పున, 8 జిల్లా, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో పది చొప్పున పడకలు ఉన్నాయి. వీటి ద్వారా చిన్నారులు ప్రయోజనం పొందుతున్నారు. జాతీయ ఆరోగ్య మిషన్ కింద ఈ కేంద్రాల కార్యకలాపాలు కొనసాగుతాయి.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

andhra-pradesh child-health hospital-development Latest News in Telugu NRCs nutrition-centres pediatric-nutrition public-health Telugu News tribal-health

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.