📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest news: AP: ట్రాన్స్ జెండర్లకు రిజర్వేషన్ల కల్పనపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి

Author Icon By Saritha
Updated: October 29, 2025 • 12:25 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కర్ణాటకలో అమలు తీరును అధ్యయనం చేసి నివేదిక అందజేయాలని హైకోర్టు ఆదేశం

విజయవాడ : ఉద్యోగాల్లో ట్రాన్స్ జెండర్లకు రిజర్వేషన్ల కల్పనపై(AP) ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. సానుకూల నిర్ణయం తీసుకోవాలని రాష్ట్రానికి ఆదేశించింది. ట్రాన్స్ జెండర్లకు కర్ణాటకలో( ప్రభుత్వ ఉద్యోగాల్లో ఒక శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నందున రాష్ట్రంలోనూ అదే తరహా నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని చెప్పింది. కర్ణాటకలో అమలు తీరును అధ్యయనం చేసి, రిజర్వేషన్ కల్పనపై నివేదిక అందజేయాలంది. విచారణను 4 వారాలకు వాయిదా వేస్తూ జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ ఎ హరిహరనాథ శర్మతో కూడిన డివిజన్ బెంచ్ ఆదేశించింది. 2018 నవంబర్లో జారీ చేసిన ఎస్ఐ(SI) పోస్టుల భర్తీ నోటిఫికేషన్లో ట్రాన్స్ జెండర్లకు రిజర్వేషన్ కల్పన అంశం లేదంటూ ట్రాన్స్ జెండర్ గంగా భవానీ ఆ తర్వాత ఏడాది హైకోర్టును ఆశ్రయించారు.

Read also: సింగర్ చన్నీ నట్టన్ ఇంటిపై కాల్పుల బాధ్యత మాదే: బిష్ణోయ్

AP: ట్రాన్స్ జెండర్లకు రిజర్వేషన్ల కల్పనపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి

ఎస్ఐ పోస్టుకు ఇచ్చిన దరఖాస్తు కాలమ్లో స్త్రీ, పురుష ఐచ్ఛికాలు మాత్రమే ఉన్నాయని, ట్రాన్స్ జెండర్ కాలమ్ లేదని, దీంతో తాను స్త్రీగా ఐచ్ఛికం ఇవ్వాల్సి వచ్చిందని భవానీ పిటిషన్లో వివరించారు. రాత పరీక్షలో 35 శాతం మార్కులు వచ్చినప్పటికీ అధికారులు(AP) తదుపరి ప్రక్రియకు తనను అనర్హురాలిగా ప్రకటించారన్నారు. దీనిపై పిటిషన్ ను సింగిల్ జడ్జి కొట్టేయడంతో అప్పీల్ దాఖలు చేయాల్సి వచ్చిందని వివరించారు. గంగా భవానీకి ఉద్యోగం కల్పించే విషయంలో నిర్ణయం తీసుకోవాలని హోంశాఖ ముఖ్యకార్యదర్శి కుమార్ విశ్వజీతిని గతేడాది బెంచ్ ఆదేశించింది. ప్రభుత్వం తరపున అదనపు అడ్వకేట్ జనరల్ సాంబశివ ప్రతాప్ వాదిస్తూ, పిటిషనర్కు 28 శాతమే మాత్రమే మార్కులు వచ్చాయన్నారు. అర్హతకు 35 శాతం మార్కులు రావాలన్నారు. కర్ణాటకలో ప్రభుత్వ ఉద్యోగాల్లో ట్రాన్స్ జెండర్లకు ఒక శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయని చెప్పారు.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Andhra Pradesh High Court Employment Reservation Ganga Bhavani Government Decision Job Reservation Karnataka Model Latest News in Telugu Telugu News Transgender Rights

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.