AP High Court: ఏపీలో సంచలనం సృష్టించిన అక్రమ మద్యం కేసులో రాష్ట్ర హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి మరియు వెంకటేష్ నాయుడులకు న్యాయస్థానం బెయిల్(Court bail) మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది. వీరు దాఖలు చేసిన పిటిషన్లను విచారించిన కోర్టు, వారికి ఉపశమనం కలిగించింది. దీంతో ఈ ముగ్గురు నిందితులు త్వరలోనే జైలు నుంచి విడుదల కానున్నారు.
Read Also: AP: గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు
కేసులో ప్రధాన నిందితుడు
అయితే, ఇదే కేసులో ప్రధాన నిందితుడు (A1)గా ఉన్న రాజ్ కేసిరెడ్డికి మాత్రం హైకోర్టులో చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన బెయిల్ దరఖాస్తును న్యాయస్థానం తోసిపుచ్చింది (Dismiss). కేసు తీవ్రత దృష్ట్యా ఆయనకు బెయిల్ ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది. ప్రస్తుతం ఈ తీర్పు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: