ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాల్లో ఏఐ వేగంగా విస్తరిస్తోంది. ప్రజలకు సూచనలు ఇవ్వడమే కాక వైద్య, న్యాయ రంగాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. ఇటీవల ఓ న్యాయాధికారి ఏఐ టెక్నాలజీ సాయంతో జారీ చేసిన ఉత్తర్వులపై ఏపీ (AP) హైకోర్టులో (AP High Court) విచారణ జరగగా, ఏఐ వినియోగంపై కోర్టు ముఖ్య వ్యాఖ్యలు చేసింది.
ఏఐని వాడటంపై చాలా అప్రమత్తంగా ఉండాలని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఉత్తర్వులు, తీర్పుల విషయంలో ఏఐ ఇచ్చే సమాచారాన్ని యథాతథంగా స్వీకరించవద్దని సూచించింది. ఏఐ ఇచ్చే సమాచారం నమ్మదగినదిగా కనిపించినప్పటికీ దాన్ని యథాతథంగా అమలు చేసే ప్రయత్నం చేయవద్దని తెలిపింది. ఏఐ ఇచ్చే సమాచారంలో చట్టపరంగా తప్పులు ఉండే అవకాశం ఉందని చెప్పింది. కొన్ని సందర్భాల్లో కేసుకు సంబంధమే లేని తీర్పులను ఏఐ చూపుతోందని హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఏఐని గుడ్డిగా నమ్మితే తప్పులు జరిగి, న్యాయ వ్యవస్థపై ప్రజల విశ్వాసం దెబ్బతినే ప్రమాదం ఉందని పేర్కొంది
Read Also: AP: గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు
తీర్పుల విషయంలో ఏఐని యథాతథంగా స్వీకరించవద్దన్న హైకోర్టు
విచారణ సందర్భంగా, ఏఐ సాయంతో (AP High Court) ఉత్తర్వులను ఇచ్చిన సదరు న్యాయాధికారి మాట్లాడుతూ… తాను ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొన్న కొన్ని తీర్పులు ఏఐ (Artificial intelligence) సూచించినవేనని కోర్టుకు తెలిపారు. తాను తొలిసారి ఏఐని వాడానని, ఈ కారణంగానే పొరపాటు జరిగిందని చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి తప్పులు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటానని తెలిపారు. తన ఉత్తర్వుల్లో అన్వయించిన చట్టసూత్రం మాత్రం సరైనదేనని కోర్టుకు తెలియజేశారు. ఈ క్రమంలో, ఏఐని వినియోగించే విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని హైకోర్టు సూచించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: