📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

AP High Court: నాలుగు వ్యవసాయ వర్సిటీల ప్రొఫెసర్లకు హైకోర్టులో ఊరట!

Author Icon By Tejaswini Y
Updated: February 25, 2026 • 11:38 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

AP High Court: ఏపీలోని నాలుగు వ్యవసాయ విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్లకు హైకోర్టులో భారీ ఊరట లభించింది. తమ పదవీ విరమణ వయసును 62 నుంచి 65 ఏళ్లకు పెంచకపోవడాన్ని సవాల్ చేస్తూ వారు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన ధర్మాసనం, రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టింది. ఉన్నత విద్యాశాఖ పరిధిలోని ప్రొఫెసర్లకు పదవీ విరమణ వయసు పెంచి, వ్యవసాయ శాఖ పరిధిలోని వారికి పెంచకపోవడం వివక్ష చూపడమేనని, ఇది రాజ్యాంగంలోని అధికరణ 14కు విరుద్ధమని జస్టిస్ బట్టు దేవానంద్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.

Read Also: Save Punarvika: పునర్విక కోసం కదిలిన హృదయాలు..16 కోట్ల మనీ కలెక్షన్

AP High Court: Relief for professors of four agricultural universities in the High Court!

ప్రభుత్వానికి కీలక ఆదేశాలు

ఈ సందర్భంగా ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ, డాక్టర్ వైఎస్సార్ ఉద్యానవన, శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ, ఎపి ఫిషరీస్ యూనివర్శిటీల పరిధిలో పదవీ విరమణ చేయనున్న పిటిషనర్లను తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు సర్వీసులోనే కొనసాగించాలని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అలాగే ఈ యూనివర్సిటీలలో పదవీ విరమణ వయసు పెంచడానికి వీల్లేదంటూ ఫిబ్రవరి 15న వ్యవసాయశాఖ స్పెషల్ సిఎస్ జారీ చేసిన ఆదేశాలను కూడా హైకోర్టు సస్సెండ్ చేసింది.

ప్రొఫెసర్ల పదవీ విరమణ

ప్రభుత్వం దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ, తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. గతంలో ఉన్నత విద్యాశాఖ పరిధిలోని వర్సిటీల్లో యూజిసి స్కేల్స్(UGC Scales) పొందుతున్న ప్రొఫెసర్ల పదవీ విరమణ వయసును ప్రభుత్వం 62 నుంచి 65 ఏళ్లకు పెంచింది. అయితే, వ్యవసాయ శాఖ పరిధిలోని నాలుగు వర్సిటీలకు ఈ ప్రయోజనాన్ని వర్తింపజేయలేదు. దీంతో ప్రొఫెసర్లు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై గతంలో సింగిల్ జడ్జి విచారణ జరిపి, ఇది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని పేర్కొన్నారు.

అనంతరం పిటిషనర్లు డివిజన్ బెంచ్ను ఆశ్రయించగా, తాజా విచారణ జరిగింది. విచారణకు హాజరైన వ్యవసాయశాఖ స్పెషల్ సిఎస్, కాంపిటెంట్ అధారిటీ నిర్ణయం మేరకే పదవీ విరమణ వయసు పెంపు ప్రతిపాదనలను తిరస్కరించినట్లు తెలిపారు. దీనిపై ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఈ ప్రభుత్వం ఎందుకు సమర్థిస్తోందని, తిరస్కరించడానికి గల కారణాలను స్పష్టంగా చెప్పలేదని ప్రశ్నించింది. ఉన్నత పదవుల్లో ఉన్నవారి ఆలోచనలు తెలుసుకోకుండా అధికారులు ఎలా నిర్ణయాలు తీసుకుంటారని ప్రభుత్వాన్ని నిలదీసింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

AP Agricultural University Professors AP Fisheries University Justice Battu Devanand Professors Retirement Age 65 SV Veterinary University

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.