📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు

AP High Court: స్పీడ్ బ్రేకర్లపై హైకోర్టు కీలక ఆదేశాలు..

Author Icon By Anusha
Updated: August 16, 2025 • 3:09 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్‌లో రహదారులపై ఎక్కడ చూసినా అనియంత్రితంగా ఏర్పాటు చేసిన స్పీడ్‌బ్రేకర్లు వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. ముఖ్యంగా జాతీయ రహదారులు, రాష్ట్ర హైవేలు, జిల్లా రోడ్లు, గ్రామీణ మార్గాల్లో ప్రమాణాలు లేకుండా ఏర్పరిచిన స్పీడ్‌బ్రేకర్ల (Speed breakers) వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర హైకోర్టు జోక్యం చేసుకుని ప్రభుత్వం, సంబంధిత శాఖలకు కీలక ఆదేశాలు జారీ చేసింది.ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవిలతో కూడిన ధర్మాసనం ఈ ఉత్తర్వులు వెలువరించింది. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం, ఇండియన్ రోడ్ కాంగ్రెస్ (IRC) విడుదల చేసిన కొత్త మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా అమలు చేయాలని స్పష్టం చేసింది. స్పీడ్‌బ్రేకర్ల నిర్మాణంలో పాటించాల్సిన డిజైన్, ఎత్తు, వెడల్పు, రంగులు, సూచిక బోర్డులు వంటి అంశాలు IRC మార్గదర్శకాలలో స్పష్టంగా పొందుపరిచిన సంగతి తెలిసిందే.

నిబంధనలకు విరుద్ధంగా

ఇప్పటికే రాష్ట్రంలోని అనేక రోడ్లపై ప్రమాణాలు పాటించకుండా నిర్మించిన స్పీడ్‌బ్రేకర్లు ఉన్నాయని, వాటిని కూడా కొత్త నిబంధనలకు అనుగుణంగా సరిదిద్దాలని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (SGP) కోర్టుకు సమాచారం అందించగా, హైకోర్టు ప్రభుత్వం సంబంధిత అధికారులకు వెంటనే సర్క్యులర్ జారీ చేయాలని సూచించింది.హైకోర్టు ఇచ్చిన ఈ ఉత్తర్వులు ఈ నెల 6న జారీ అయినప్పటికీ, ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి.నిబంధనలకు విరుద్ధంగా స్పీడ్‌బ్రేకర్ల ఏర్పాటు వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని న్యాయవాది తాండవ యోగేష్ ఏపీ హైకోర్టు (AP High Court) లో పిల్‌ దాఖలు. వాటిని తొలగించాలని లేదా IRC ప్రమాణాలకు అనుగుణంగా సరిదిద్దాలని ఆయన కోరారు. పిటిషనర్, ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (SGP) వాదనల (స్పీడ్ బ్రేకర్లపై ఐఆర్‌సీ కొత్త రూల్స్ ఇచ్చిందని కోర్టుకు తెలిపారు) తర్వాత IRC కొత్త మార్గదర్శకాలు తీసుకొచ్చిందని కోర్టు పేర్కొంది.

AP High Court

స్పీడ్‌ బ్రేకర్‌ యొక్క వెడల్పు

వాటిని అమలు చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్రంలో తప్పుగా వేసిన స్పీడ్‌ బ్రేకర్లను సరిచేయాలని కోర్టు ఆదేశించింది.. లేదంటే వాటిని తొలగించాలని ఆదేశించింది. ఈ మేరకు ఆర్‌అండ్‌బీ చీఫ్ ఇంజనీర్‌ ఫిబ్రవరిలో మెమో ఇచ్చారని గుర్తు చేసింది.ఐఆర్‌సీ మార్గదర్శకాల ప్రకారం స్పీడ్‌ బ్రేకర్లు ఎలా ఉండాలో హైకోర్టు ధర్మాసనం వివరించింది. స్పీడ్‌ బ్రేకర్‌ యొక్క వెడల్పు 3.7 మీటర్లు ఉండాలి. దాని ఎత్తు 0.10 మీటర్లు అంటే 10 సెంటీమీటర్లు ఉండాలి. వాహనం దాని పైకి ఎక్కి దిగేటప్పుడు 17 మీటర్ల వ్యాసార్థం ఉండాలి. “వాహనం పైకెక్కి, దిగేటప్పుడు (బంప్‌) 17 మీటర్ల వ్యాసార్థం ఉండాలి” అని తెలిపింది. స్పీడ్‌ బ్రేకర్‌ స్పష్టంగా కనిపించేలా తెలుపు, పసుపు రంగులు వేయాలని.. స్పీడ్‌ బ్రేకర్‌ వస్తుంది అని చెప్పడానికి 40 మీటర్ల దూరంలో ఒక హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేయాలని ఆదేశించింది.

హైకోర్టు ఎప్పుడు, ఎక్కడ స్థాపించబడింది?

2019 జనవరి 1న అమరావతిలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అధికారికంగా ప్రారంభమైంది. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఇది వేరుగా ఏర్పాటు చేశారు.

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఎవరు నియమిస్తారు?

భారత రాష్ట్రపతి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిఫార్సుపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని నియమిస్తారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/dharmavaram-nia-on-high-alert-over-dharmavaram-terror-attack-one-person-arrested/andhra-pradesh/530955/

Andhra Pradesh High Court highway rules Indian Road Congress guidelines road safety speed breakers traffic regulations

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.