ఆంధ్రప్రదేశ్ (AP) హైకోర్టు ప్రభుత్వ అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏసీ గదుల్లో కూర్చుని నిర్ణయాలు తీసుకుంటారా? క్షేత్ర స్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు మీకు ఎలా తెలుస్తాయి? అంటూ అధికారులను ప్రశ్నిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేసింది.చేపలు, మాంసం దుకాణాలకు ఈ-వేలం నిర్వహిస్తే.. కంప్యూటర్ పరిజ్ఞానం లేని చిన్న చిన్న వ్యాపారులు ఈ-వేలంలో ఎలా పాల్గొంటారు, పేపర్లను ఎలా అప్‌లోడ్ చేస్తారని హైకోర్టు ప్రశ్నించింది.
Read Also: AP: పేద కుటుంబంలో పెను విషాదం..ముగ్గురు మృతి
ఏసీ రూముల్లో కూర్చుని నిర్ణయాలు తీసుకుంటున్నారు
ఈ-వేలం విధానాన్ని అనుసరించడంపై తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది.ఈ-వేలం ప్రక్రియలో క్షేత్ర స్థాయి సమస్యలను పరిగణనలోకి తీసుకోకుండా.. ఏసీ రూముల్లో కూర్చుని అధికారులు నిర్ణయాలు తీసుకుంటున్నారని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాకుండా, ఈ-వేలం టెండర్ గురించి తెలుగు పేపర్లలో కూడా ఇంగ్లీషులో ప్రకటనలు ఇవ్వడంపై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. చిరు వ్యాపారులకు సంబంధించిన ఇలాంటి వ్యవహారాల్లో బహిరంగ వేలం నిర్వహించడమే ఉత్తమమని కోర్టు అభిప్రాయపడింది.
విజయవాడలోని మహంతి మార్కెట్‌లో మాంసం, చేపల దుకాణాల కేటాయింపు కోసం జనవరి 6న అధికారులు జారీ చేసిన నోటిఫికేషన్‌ని.. తర్వాతి విచారణ పూర్తి అయ్యే వరకు సస్పెండ్ చేసింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని విజయవాడ కార్పొరేషన్ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. తర్వాతి విచారణను మార్చి 3కి వాయిదా వేసింది.హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణప్రసాద్ శుక్రవారం ఈ మేరకు ఉత్తర్వులిచ్చారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: