📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

AP High Court: అంబటి రాంబాబుకు నోటీసులిచ్చి వివరణ తీసుకోవాలి

Author Icon By Tejaswini Y
Updated: February 11, 2026 • 11:51 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

AP High Court : ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత, అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ఘటనలో వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై రాష్ట్ర వ్యాప్తంగా వివిధ స్థానాల్లో నమోదైన 33 కేసుల్లో బీ. ఎన్ ఎస్ ఎస్ సెక్షన్ 35(3) ప్రకారం నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ఫిర్యాదుదారులకు నోటీసులు ఇచ్చి విచారణను మార్చి 2కు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు.

Read also: Abhishek Sharma: ఆసుపత్రిలో చేరిన అభిషేక్.. మ్యాచు డౌట్ యే

AP High Court: Ambati Rambabu should be given notice and asked to explain

అత్యవసరంగా దాఖలు చేసిన వ్యాజ్యాలపై హైకోర్టు విచారణ

తనపై నమోదు చేసిన 33 కేసులను కొట్టేయాలని అంబటి రాంబాబు అత్యవసరంగా దాఖలు చేసిన వ్యాజ్యాలపై హైకోర్టు విచారణ జరిపింది. హైకోర్టులో సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్రెడ్డి(Ponnavol Sudhakar Reddy) అంబటి రాంబాబు తరఫున వాదనలు వినిపించారు. ఒకే ఘటన పై రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 35 కేసులు నమోదు చేశారని అన్నారు. దీనిపై న్యాయమూర్తి స్పందించారు. ఒకే ఘటనపై బహుళ ఎఫ్ఐఆర్లు నమోదు చేయడానికి వీల్లేదని సుప్రీం కోర్టు పలు తీర్పులు ఇచ్చిందని గుర్తు చేశారు. ఒకే ఘటనపై చాలా కేసులు నమోదు చేసిన నేపథ్యంలో పోలీసులకు తగిన సూచనలు చేయాలని పీపీ (పబ్లిక్ ప్రాసిక్యూటర్)ని కోరారు.

పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మి నారాయణ స్పందిస్తూ నల్లపాడు స్థానాలో నమోదైన కేసును ప్రధానమైనదిగా పరిగణించి మిగిలిన కేసుల ఎఫ్ఐఆర్లను సీఆర్సీపీ సెక్షన్ 162 ప్రకారం వాంగ్మూలాలుగా పరిగణించే విషయాన్ని పరిశీలించి తగిన సూచనలు చేస్తానన్నారు. ఫిర్యాదు చేయడానికి వచ్చిన ప్రజలను పోలీసులు నిరోధించలేరని, ఈ నేపథ్యంలో వివిధ ఠాణాల్లో కేసులు నమోదు అయ్యాయన్నారు. వెన్నుపోటు దినం పేరుతో అనుమతి లేకుండా బైక్ ర్యాలీ నిర్వహించడంతో పాటు అడ్డుకున్న సీఐ పై దూషింటి బెదిరించారని అంబటి రాంబాబు పై పట్టాభిపురం పోలీసులు, జూట్మీల్ భూ వివాదంలో అంబటి రాంబాబు జోక్యం చేసుకొని తనను బెదిరించారంటూ ఓ కార్మిక నాయకుడు ఇచ్చిన ఫిర్యాదు పై గుంటూరులోని పట్టాభిపురం, నగరంపాలెం పోలీసులు గతేడాది నమోదు చేసిన 2 కేసుల్లో అంబటికి నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

ambati rambabu AP High Court CM Chandrababu naidu Multiple FIRs Case Ponnavolu Sudhakar Reddy Section 35(3) BNSS YSRCP Leaders Cases

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.