(AP) జనవరి 25న రథసప్తమి పండుగ సందర్భంగా తిరుమల పుణ్యక్షేత్రానికి దేశవ్యాప్తంగా భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఇప్పటికే పలువురు భక్తులు తిరుమలకు చేరుకుని గ్యాలరీలు, వేచిచూసే ప్రదేశాల్లో నిలిచిపోయారు. రథసప్తమి బ్రహ్మోత్సవాలను దర్శించుకునేందుకు ముందస్తుగా వచ్చిన భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.
Read Also: AP: పేద కుటుంబంలో పెను విషాదం..ముగ్గురు మృతి
అయితే, తిరుమలలో ఖాళీగా ఉన్న గదులు ఉన్నప్పటికీ వాటిని తక్షణమే కేటాయించడం లేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రేపు తెల్లవారుజామున మాత్రమే గదులు కేటాయిస్తామని అధికారులు చెప్పడంతో, రాత్రంతా చలిలో ఇబ్బందులు పడాల్సి వస్తోందని భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ముందస్తు ప్రణాళికతో గదుల కేటాయింపు, తాగునీరు, భోజనం, భద్రత వంటి మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరచాల్సిన అవసరం ఉందని పలువురు సూచిస్తున్నారు. రథసప్తమి వంటి ముఖ్యమైన పర్వదినాల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ అధికారులు తగిన ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: