हिन्दी | Epaper
ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట

Rain Alert: ఏపీకి గురు, శుక్రవారాల్లో అతి భారీ వర్షాలు ..రెయిన్ అలర్ట్ జారీ

Vanipushpa
Rain Alert: ఏపీకి గురు, శుక్రవారాల్లో అతి భారీ వర్షాలు ..రెయిన్ అలర్ట్ జారీ

బంగాళాఖాతంలో వెనువెంటనే అల్పపీడనాలు ఏర్పడేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. నైరుతి బంగాళాఖాతంలో బుధవారం అల్పపీడనం ఏర్పడే అవకాశముందని భారత వాతావరణ విభాగం తెలిపింది. దీని ప్రభావంతో రాబోయే ఆరు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడొచ్చని పేర్కొంది. గురు, శుక్రవారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ నెల 18న మరో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో ఈ నెలాఖరు వరకు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని అభిప్రాయపడుతున్నారు. నిన్న పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి.

Rain Alert: ఏపీకి గురు, శుక్రవారాల్లో అతి భారీ వర్షాలు ..రెయిన్ అలర్ట్ జారీ
Rain Alert: ఏపీకి గురు, శుక్రవారాల్లో అతి భారీ వర్షాలు ..రెయిన్ అలర్ట్ జారీ

కదిరిలో రహదారులు జలమయం
శ్రీసత్యసాయి జిల్లా కదిరిలో అరగంట పాటు ఏకధాటిగా కురిసిన వర్షానికి ప్రధాన రహదారులు జలమయం అయ్యాయి. దీంతో రాకపోకలు సాగించేందుకు వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ధర్మవరంలో ప్రధాన రహదారులపై వర్షపు నీరు ప్రవహించింది. ఇంధీరమ్మ కాలనీలో ఇళ్లలోకి వరద నీరు చేరింది. వర్షాలపై విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ముగ్గురు సీఎండీలు, జిల్లాల అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రానికి ఎల్లో అలర్ట్ జారీ చేయడంతో అధికారులను మంత్రి అప్రమత్తం చేశారు. వర్ష ప్రభావిత జిల్లాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలన్నారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని ఆదేశించారు. వర్షాలు, ఈదురుగాలులతో కూలిన కరెంటు స్తంభాల పునరుద్ధరణ వెంటనే చేపట్టాలని తేల్చిచెప్పారు.
ఈ నెల 13 నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం
ఉత్తర అంతర కర్ణాటక, దాని పరిసర ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 4.5 నుంచి 5.8 కిలోమీటర్ల మధ్య ఎత్తులో విస్తరించి కొనసాగుతున్నది. వాయవ్య బంగాళాఖాతం ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 13 నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఉత్తర కోస్తా ,యానాంలో దిగువ ట్రోపో ఆవరణములో నైరుతి దిశగా దక్షిణ కోస్తా,రాయలసీమలో దిగువ ట్రోపో ఆవరణములో వాయువ్య, పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలను వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు
ఉత్తర కోస్తా,యానాంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్నిచోట్ల కురిసే అవకాశముంది. భారీవర్షాలు ఒకటి లేదా రెండుచోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేకచోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా జల్లులు కొన్నిచోట్ల కురిసే అవకాశముండగా భారీవర్షాలు ఒకటి లేదా రెండుచోట్ల కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

వర్షం వస్తుందని ఎలా చెప్పాలి?

సాధారణంగా, తెల్లగా మరియు ఎత్తుగా ఉన్న మేఘాలు మంచి వాతావరణాన్ని సూచిస్తాయి మరియు చీకటిగా మరియు తక్కువగా ఉన్న మేఘాలు వర్షం లేదా తుఫానులను సూచిస్తాయి . తెల్లగా, చిన్నగా ఉన్న మేఘాలు సాధారణంగా వాతావరణం స్పష్టంగా ఉంటుందని అర్థం. చదునైన మేఘాలు గాలి స్థిరంగా ఉందని, మెత్తటి మేఘాలు అస్థిరంగా ఉన్నాయని అర్థం.

భారీ వర్షం వస్తుందని ఎలా తెలుస్తుంది?

భారీ వర్షం – అవపాతం రేటు గంటకు 7.6 మిమీ (0.30 అంగుళాలు) కంటే ఎక్కువగా ఉన్నప్పుడు లేదా గంటకు 10 మరియు 50 మిమీ (0.39–1.97 అంగుళాలు) మధ్య ఉన్నప్పుడు . హింసాత్మక వర్షం – అవపాతం రేటు గంటకు 50 మిమీ (2.0 అంగుళాలు) కంటే ఎక్కువగా ఉన్నప్పుడు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/rahul-gandhi-leaders-arrested/national/528939/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870