📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు

News Telugu: AP: సాధారణ రోగిలా గుంటూరు జీజీహెచ్‌కు వెళ్లిన ఆరోగ్య కార్యదర్శి

Author Icon By Rajitha
Updated: November 30, 2025 • 12:13 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి సౌరభ్ గౌర్ శనివారం గుంటూరు (Gunturu) ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి (జీజీహెచ్)కు ఒక సాధారణ రోగిలా వచ్చి తనిఖీ నిర్వహించారు. జ్వర సమస్యతో ఉన్నట్లుగా చెప్పి ఓపీ చీటీ తీసుకున్నారు, క్యూలో నిలబడి మందులు పొందుతూ ఆసుపత్రిలోని విభాగాలను సవివరంగా పరిశీలించారు. ఈ అకస్మిక సందర్శనతో వైద్య సిబ్బంది ఆశ్చర్యానికి గురయ్యారు.

Read also: AP Cyclone Dithwa: రాగల మూడు రోజులు ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

Health Secretary went to Guntur

వైద్యుల పనితీరును సమీక్షిస్తూ

ఒక గంట తర్వాత ఉన్నతాధికారుల ద్వారా జీజీహెచ్ సూపరింటెండెంట్‌కు సమాచారం చేరింది. ఆ తర్వాత సౌరభ్ గౌర్ సూపరింటెండెంట్‌ను వెంటబెట్టి ల్యాబ్, మెడికల్ ఓపీ, ఫార్మసీ వంటి విభాగాలను తనిఖీ చేశారు. ఓ పీజీ వైద్య విద్యార్థి రోగులతో కటువుగా వ్యవహరించడం గమనించగా, ఆయన స్పందించి విద్యార్థిని శిక్షించారు.

మందుల చీటీలను సరిగా నిర్వహించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన సౌరభ్ గౌర్, సమస్య పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అంతేకాకుండా, వైద్యుల పనితీరును సమీక్షిస్తూ ప్రతి వైద్యుని “కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్” వివరాలను తీసుకున్నారు. ఈ ఆకస్మిక తనిఖీ జీజీహెచ్‌లో కలకలం సృష్టించింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

guntur-ggH health-secretary latest news saurabh-gaur surprise-visit Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.